‘సూపర్ డీలక్స్’ ట్రైలర్.. సమంత కత్తి పట్టుకుని రచ్చ రచ్చ..

స‌మంత అక్కినేని ఇప్పుడు తెలుగులోనే కాదు.. త‌మిళ‌నాట కూడా వ‌ర‌స సినిమాలు చేస్తుంది. పెళ్లి త‌ర్వాత కూడా ఎవ‌రి మాటా విన‌డం లేదు. ఇప్పుడు ఈమె త‌మిళ‌నాట న‌టిస్తున్న సినిమా సూప‌ర్ డీల‌క్స్. విజ‌య్ సేతుప‌తి ఇందులో హీరో. త్యాగ‌రాజ కుమార్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 22, 2019, 6:31 PM IST
‘సూపర్ డీలక్స్’ ట్రైలర్.. సమంత కత్తి పట్టుకుని రచ్చ రచ్చ..
సూపర్ డీలక్స్ పోస్టర్ (Source: Twitter)
  • Share this:
స‌మంత అక్కినేని ఇప్పుడు తెలుగులోనే కాదు.. త‌మిళ‌నాట కూడా వ‌ర‌స సినిమాలు చేస్తుంది. పెళ్లి త‌ర్వాత కూడా ఎవ‌రి మాటా విన‌డం లేదు. ఇప్పుడు ఈమె త‌మిళ‌నాట న‌టిస్తున్న సినిమా సూప‌ర్ డీల‌క్స్. విజ‌య్ సేతుప‌తి ఇందులో హీరో. త్యాగ‌రాజ కుమార్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ట్రైల‌ర్ చూసుండ‌రు అంటూ ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Vijay Sethupathi, Samantha Akkineni Super Deluxe movie trailer released pk.. స‌మంత అక్కినేని ఇప్పుడు తెలుగులోనే కాదు.. త‌మిళ‌నాట కూడా వ‌ర‌స సినిమాలు చేస్తుంది. పెళ్లి త‌ర్వాత కూడా ఎవ‌రి మాటా విన‌డం లేదు. ఇప్పుడు ఈమె త‌మిళ‌నాట న‌టిస్తున్న సినిమా సూప‌ర్ డీల‌క్స్. విజ‌య్ సేతుప‌తి ఇందులో హీరో. త్యాగ‌రాజ కుమార్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. Super Deluxe movie trailer,Super Deluxe movie trailer released,vijay sethupathi Super Deluxe,Vijay Sethupathi Samantha Akkineni,super duluxe director thiagarajan kumararaja,Super Deluxe movie trailer released,super deluxe trailer review,samantha vijay sethupathi movie,ramya krishna samantha akkineni,telugu cinema,tamil cinema,సూపర్ డీలక్స్ ట్రైలర్,సమంత విజయ్ సేతుపతి,సూపర్ డీలక్స్ ట్రైలర్ విడుదల,విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ సమంత,రమ్యకృష్ణ సమంత అక్కినేని,తమిళ్ సినిమా
సూపర్ డీలక్స్ పోస్టర్


ఇప్పుడు అనుకున్న‌ట్లుగానే ఈ చిత్ర ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇందులో విజ‌య్ సేతుప‌తి అమ్మాయిగా న‌టిస్తున్నాడు. స‌మంత అక్కినేని హీరోయిన్. ఈమె పాత్ర కూడా ఆస‌క్తిక‌రంగా ఉంది. ట్రైల‌ర్లో క‌త్తి ప‌ట్టుకుని ఎవ‌ర్నో న‌రుకుతున్న‌ట్లు చూపించాడు ద‌ర్శ‌కుడు త్యాగ‌రాజ‌న్. ఇక ఫ‌హాద్ ఫాజిల్, ర‌మ్య‌కృష్ణ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సూప‌ర్ డీల‌క్స్ ట్రైల‌ర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. రెండు నిమిషాల ట్రైల‌ర్లో క‌థ‌ ఏ మాత్రం అర్థం కాకుండా క‌ట్ చేసాడు ద‌ర్శ‌కుడు. మార్చ్ 29న విడుద‌ల కానుంది ఈ చిత్రం. స‌మంత‌, ర‌మ్య‌కృష్ణ లాంటి స్టార్స్ ఉన్నారు కాబ‌ట్టి తెలుగులో కూడా ఈ చిత్రం విడుద‌ల కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ సూప‌ర్ డీల‌క్స్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో..?
First published: February 22, 2019, 6:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading