హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ సినిమాకు పన్ను మినహాయించిన యోగి ప్రభుత్వం..

సూపర్ 30 కి యూపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు

బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సూపర్ 30’. ఈ సినిమాలో ఎందరో పేద విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు నింపిన మ్యాథ్స్ లెక్చరర్ ఆనంద్ కుమార్ పాత్రలో నటించాడు. తాజాగా ఈ సినిమాకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం పన్ను మినహాయించింది.

 • Share this:
  బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సూపర్ 30’. ఈ సినిమాలో ఎందరో పేద విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు నింపిన మ్యాథ్స్ లెక్చరర్ ఆనంద్ కుమార్ పాత్రలో నటించాడు.అతనంటే విద్యార్దుల్లో ఎంతో గౌరవం ఉంది. తన లెక్కలతో ఎంతో మంది సామాన్యులను అసామాన్యలుగా తీర్చిదిద్దిన ఆయన జీవితం ఎందరికో స్పూర్తి దాయకం. ప్రతి యేడాది మెరికల్లాంటి 30 మంది విద్యార్ధులను సెలక్ట్ చేసి వాళ్లకు కోచింగ్ ఇవ్వడం.. వాళ్లందరు జాతీయ స్థాయిలో జరిగే ఐఐటీకి సెలెక్ట్ అవుతుంటారు. అలాంటి లెక్కల మాస్టారి పాత్రలో హృతిక్ రోషన్ నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను మన దేశ ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా వీక్షించి హృతిక్‌ను అభినందించాడు.

  Super 30 Declared Tax Free in Uttar Pradesh, Hrithik Roshan Thanks Yogi Adityanath,super 30 uttar pradesh,up government,super 30 declared tax free,hrithik roshan super 30,hrithik roshan,super 30,super 30 hrithik roshan,super 30 movie,super 30 trailer,anand kumar super 30,super 30 trailer hrithik roshan,hrithik roshan new movie,super 30 songs,hrithik roshan in patna,super 30 review,super 30 trailer out,super 30 movie review,super 30 public review,super 30 trailer release date,hrithik roshan news,hrithik roshan patna,సూపర్ 30,హృతిక్ రోషన్,హృతిక్ రోషన్ సూపర్ 30 టాక్స్ ఫ్రీ,ఉత్తర ప్రదేశ్ సూపర్ 30కి టాక్స్ మినహాయింపు,యోగీ ఆదిత్య నాథ్,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,
  సూపర్ 30 సినిమాను వీక్షించిన భారత ఉప రాష్ట్రపతి (ఫైల్ ఫోటో)


  ఎంతో మందికి స్పూర్తి నింపిన ఈ సినిమాకు పలు రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఇప్పటికే రాజస్థాన్,బిహార్ వంటి రాష్ట్రాలు  ఈ సినిమాకు టాక్స్ మినహాయించగా..తాజగా ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను మినహాయిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా వాల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకు చేరువలోకి వచ్చింది. ముందు ముందు ‘సూపర్ 30’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మెరుపులు మెరుపులు మెరిపిస్తుందో చూడాలి.

   
  First published: