బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ (Sunny Leone) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గతంలో మంచు మనోజ్ (Manchu Manoj) చిత్రం 'కరెంట్ తీగ'లో సన్నీ మెరిసింది. ఇప్పుడు మంచు విష్ణు (Manchu Vishnu) సినిమాలో నటిస్తోంది. ఆమె రెండు తెలుగు సినిమాలు కూడా మంచు వారి చిత్రాలే. మంచు విష్ణు సినిమా కోసం కొన్ని రోజులుగా హైదరాబాద్ లో సందడి చేస్తోంది. మంచువారి ఆతిథ్యాన్ని అందుకుని ఆనందిస్తోంది. ఇక .. సెట్ లో మంచు విష్ణు, సన్నీ లియోన్ ల అల్లరి పనుల వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న సన్నీ లియోన్ ని ఏడిపించిన విష్ణు.. ఈసారి సన్నీ పాపను వంటలక్క గా మార్చేశాడు. తన ఇంట్లో సన్నీతో పరోటాలు చేయించాడు. ఈ వీడియోను సన్నీ తన ఇన్స్టాగ్రామ్ వేదికలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.అచ్చ తెలుగు ఆడపడుచుల లంగా వోణిలో జడ వేసుకొని సన్నీ వంట చేస్తుంటే చూడడానికి ఎంతో ముద్దు వస్తుంది. ఇక మధ్యలో విష్ణు, సన్నీకి తెలుగు నేర్పించడం, విష్ణు అన్నమాటలను తనదైన ఇంగ్లీష్ యాసలో అమ్మడు పలకడం ఎంతో ఫన్నీ గా అనిపించాయి..
ఇక చివర్లో ” దీనెక్క పరోటో అదిరిపోయింది” అనే పదాన్ని సన్నీలియోన్ వొత్తి పలకడం అభిమానులకు నవ్వు తెప్పించకుండా మానదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.. అరెరే విష్ణు అన్నా.. శృంగారతారను కాస్తా వంటలక్కను చేసేశావే అని కొందరు.. ఆహా సన్నీ అచ్చ తెలుగు అమ్మాయిల నువ్వు అలా వంట చేస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నావని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మోసగాళ్లు చిత్రం తర్వాత మంచు విష్ణు నటిస్తున్న చిత్రం గాలి నాగేశ్వరరావు. అవ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్‌పూత్, సన్నీలియోన్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూల్ ని కూడా పూర్తిచేసుకుంది.
ఇది కూడా చదవండి : ఆర్ ఆర్ ఆర్ నుంచి దోస్తీ వీడియో సాంగ్ విడుదల.. అదిరిన రెస్పాన్స్..
ఇక సన్నీలియోన్ విషయానికి వస్తే.. ఈ పేరు సినీ అభిమానులకు, ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన నటి సన్నీ. జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన సన్నీ లియోన్... ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో ఆఫర్లు సంపాదించింది. ప్రస్తుతం ఇండియాలో సెటిలై ఇక్కడి సినిమాల మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం సన్నీ హిందీతో పాటు కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటిస్తుంది. సన్నీ గతంలో తెలుగు సినిమాలు కూడా చేసిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Vishnu, Sunny Leone, Tollywood news, Viral Video