హోమ్ /వార్తలు /సినిమా /

సన్నీలియోన్‌కి విశాల్ సపోర్ట్, గిఫ్టుగా ఐటెం సాంగ్

సన్నీలియోన్‌కి విశాల్ సపోర్ట్, గిఫ్టుగా ఐటెం సాంగ్

కాంట్రవర్శీలతో కలెక్షన్లు కుమ్మేయడం కొందరికి అలవాటు. అలాంటి వాళ్లలో తన కంటూ ఓ బ్రాండ్, ఇమేజ్ తెచ్చుకుంది సన్నీలియోన్. తాజాగా ఆమె నటిస్తున్న వీరమాదేవి వివాదాల్లో చిక్కుకోగా, ఆ కాంట్రవర్శీతో కోట్లు కొల్లగొట్టడంలో సక్సెస్ అవుతోంది సన్నీలియోన్.

ఇంకా చదవండి ...

  ఇండియాలో సన్నీలియోన్ ఎంట్రీయే ఓ వివాదం. ఓ పోర్న్‌స్టార్ బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇవ్వడమేంటని అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. దాన్ని ఫుల్లుగా క్యాష్ చేసుకున్న ఈ బ్యూటీ, అందాల ఆరబోతే నమ్ముకుంటూ హర్రర్ సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత ‘వడకరి’ సినిమాతో కోలీవుడ్‌లో తళుక్కుమంది. తెలుగులో రాజశేఖర్‌ హీరోగా చేసిన ‘గరుడవేగ’తో మంచి మార్కులు కొట్టేసింది. మొన్నటికి మొన్న తన లైఫ్ స్టోరీనే బేస్ చేసుకుని తీసిన వెబ్ సిరీస్‌ కరన్‌జిత్ కౌర్‌లో నటించి, పంజాబీల ఆగ్రహాన్ని చూసింది. ఇక అప్పుడప్పుడూ సన్నీ ఐటెం సాంగ్స్‌ ఎలాగూ రచ్చ చేస్తూనే ఉన్నాయి.

  తాజాగా ఈ హాట్ బ్యూటీ తెలుగు, తమిళం, కన్నడలో రిలీజయ్యే చారిత్రక చిత్రం ‘వీరమాదేవి’లో నటిస్తోంది. ఇదే సన్నీ తాజా కాంట్రవర్శీ. ఈ సినిమాపై తమిళ, కన్నడ వర్గాలు భగ్గుమంటున్నాయి. చారిత్రక సినిమాలో సన్నీలియోన్ నటించడమేంటంటూ ఈ మూవీకి వ్యతిరేకంగా తమిళనాడులో కొందరు కేసు వేశారు.

  Image courtesy: Twitter/Sunny Leone
  Image courtesy: Twitter/Sunny Leone

  వీరమాదేవిపై వివాదం కొనసాగుతుంటే, తమిళ హీరో విశాల్, సన్నీకి సపోర్ట్‌గా నిలిచాడు. అంతేకాదు తను హీరోగా నటిస్తున్న టెంపర్ రీమేక్ మూవీ ‘అయోగ్య’లో ఓ ఐటం సాంగ్‌ చేసేందుకు అవకాశం ఇచ్చాడు. కొత్త దర్శకుడు వెంకట్‌ మోహన్‌ చేస్తున్న ఈ సినిమాలో విశాల్‌కు జోడీగా రాశిఖన్నా నటిస్తోంది. టెంపర్‌లో ఇట్టాగె రెచ్చిపోనా సాంగ్‌కి తమిళంలో ఐటెం సాంగ్‌ చేస్తున్న సన్నీలియోన్ బాగానే రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.

  ప్రతీకాత్మక చిత్రం

  సన్నీలియోన్‌కి కలిసొస్తున్న అంశం ఫ్రీ పబ్లిసిటీ. ఆమె చేస్తున్న సినిమాలు హిట్టైనా, ఫట్టైనా, ఈ భామకి మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. అందువల్ల సినిమాలైనా, పాటలైనా అవి తన కెరీర్‌కి ఎంతవరకూ కలిసొస్తాయన్న విషయాన్ని ఈ అమ్మడు పట్టించుకోవట్లేదు. కోరినంత క్యాష్ ఇస్తే చాలు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. వీరమాదేవి సినిమా మాత్రం తనలో నటనని బయటకు తీస్తోందంటున్న సన్నీ, తన కెరీర్‌లో ఇదే సెన్సేషనల్ మూవీ అవుతుందని చెబుతోంది.

  First published:

  Tags: Sunny Leone, Vishal

  ఉత్తమ కథలు