రోజుకు 150 ఫోన్ కాల్స్... ఢిల్లీ వ్యాపారికి సారీ చెప్పిన సన్నీలియోన్

కొందరు ప్రముఖులు ఫోన్ చేస్తారంటూ పునీత్‌కు సర్‌ప్రైజ్ చేసింది సన్నీలియోన్.

news18-telugu
Updated: August 3, 2019, 9:54 AM IST
రోజుకు 150 ఫోన్ కాల్స్... ఢిల్లీ వ్యాపారికి సారీ చెప్పిన సన్నీలియోన్
సన్నిలియోన్
  • Share this:
సన్నీలియోన్ .. సినీ ప్రియులకు, అబ్బాయిలకు పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈ సెక్సీ బ్యూటీ... రీసెంట్ గా తన ఫోన్ నెంబర్ ఇదేనంటూ ఓ సినిమాలో చెప్పింది. ‘అర్జున్ పాటియాల’  సినిమాలో సన్నీ ఓ ఫోన్ నెంబర్ చెప్తుంది.  ఆ నెంబర్ తనదే అని చెప్పడంతో..  అభిమానులు ఆ నెంబర్ కు ఫోన్ చేయడం  మొదలుపెట్టారు. ఆ సినిమా రిలీజైన దగ్గరి నుంచి వేలసంఖ్యలో ఆ నెంబర్ కు కాల్స్ వెళ్తున్నాయి. దీంతో ఇప్పుడు .  అసలు ఆ ఫోన్ నెంబర్ ఎవరిది.  అది నిజంగా సన్నీ నెంబరేనా లేదంటే డమ్మీ నెంబరా అన్న చర్చ మొదలయ్యింది.

అయితే అసలు విషయానికి వస్తే.. ఆ నెంబర్ నిజమే... కాని అది సన్నీలియోన్‌‌ది కాదు. ఢిల్లీకి చెందిన పునీత్ అగర్వాల్ అనే చిరు వ్యాపారి నెంబర్ అది.  ‘అర్జున్ పాటియాలా’  సినిమా రిలీజైనప్పటి నుంచి అతనికి వేలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి.  సన్నీలియోన్ తో మాట్లాడని, కోరుతూ మెసేజ్ లు ఫోన్ కాల్స్ చేస్తున్నారట.  కొందరైతే తనకు డబ్బు కూడా ఫోన్ కాల్స్ బాధను భరించలేక పునీత్ ‘అర్జున్ పాటియాలా’ యూనిట్ పై కేసు ఫైల్ చేశాడు. దీంతో ఈ విషయంపై స్పందించిన సన్నీ... పునీత్‌కు సారీ చెప్పింది.  తన కారణంగా రోజుకు 150 ఫోన్ కాల్స్ అందుకుంటున్నపునీత్‌ను క్షమాపణలు కోరింది. ఇలా అవుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, కొందరు ప్రముఖులు ఫోన్ చేస్తారంటూ పునీత్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తించింది.

గత నెల 26న ‘అర్జున్ పాటియాలా’ సినిమా విడుదలైనప్పటి నుంచి రోజుకు 150 వరకు ఫోన్ కాల్స్ వస్తుండడంతో పునీత్ విసుగెత్తిపోయాడు. ఆ నెంబర్ పునీత్‌ది అన్న  విషయం తెలియకుండానే సినిమాలో అతడి నంబరును వాడేశారు. ఈ వార్త వైరల్ కావడంతో ఎట్టకేలకు సన్నీ స్పందించి సారీ చెప్పింది.

First published: August 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు