వేధింపులు సహించకండి.. సైలెంట్‌గా ఉండకండి : సన్నీ లియోన్

సన్నీలియోన్.. ఓ హాట్ స్టార్ తెలిసిందే. ఆమె పేరు వింటే చాలు గూగుల్ కూడా వేడెక్కిపోతుంది.

news18-telugu
Updated: December 22, 2019, 11:03 PM IST
వేధింపులు సహించకండి.. సైలెంట్‌గా ఉండకండి : సన్నీ లియోన్
Instagram/sunnyleone
  • Share this:
సన్నీలియోన్.. ఓ హాట్ స్టార్ తెలిసిందే. ఆమె పేరు వింటే చాలు గూగుల్ కూడా వేడెక్కిపోతుంది. అంత ఫాలోయింగ్ ఉన్నఈ భామ ఎప్పటికప్పుడు సంచలన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో సాంగ్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే.. వేధింపులను సహించకండి అని అంటోంది సన్నీ. సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్‌గా ఉండే సన్నీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. మహిళలను ఉద్దేశించి.. పనిప్రదేశాల్లో వేధింపులను సహించకండి అంటూ వీడియోను పోస్ట్ చేసింది సన్ని. పనివేళల్లో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తెలియచేసేలా ఉన్న ఆ వీడియోలో సన్నీలియోన్ ఓ కంపెనీలో పనిచేసే ఆఫీసర్‌లా, మహిళలకు తొడ్పాటు అందించే పాత్రలో అదరగొట్టారు. సన్ని ఆ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘పని చేసేచోట వేధింపులను తట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి వాటిపై మౌనంగా ఉండకండి. మాట్లాడండి’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా ప్రస్తుతం సన్నీ.. ‘కోకో కోలా’ అనే హార్రర్‌ కామెడీలో నటిస్తోంది. దాంతో పాటు ‘రంగీలా’, ‘వీరమదేవి’ అనే సౌత్ ఇండియన్ ఫిల్మ్స్‌లోను నటిస్తోంది. ఇటూ రియాల్టీ షోలలో పాల్గొంటూ సన్నీ టీవీ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు ఈ భామ ఓ వెబ్ సీరిస్ కోసం తెలుగు యువ హీరో నవదీప్‌తో రొమాన్స్ చేయనుందని టాక్. 

View this post on Instagram
 

Workplace harassment is difficult to deal with but you don’t have to be quiet. Find yourself a supportive boss!


A post shared by Sunny Leone (@sunnyleone) on
First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు