ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. లాక్డౌన్ సందర్భంగా ప్రజా రవాణా వ్యవస్థ అయిన బస్సు, రైళ్లు, విమానాలు ఏవి గత కొన్ని రోజులుగా నడవడం లేదు. ప్రజలు ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్లాలంటే ఎంతో కష్టంగా ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్ని లియోన్ తన భర్త డేనియర్ వెబర్, పిల్లలు నిషా, నోవా, అషర్లతో కలిసి అమెరికాకు వెళ్లినట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మీ జీవితంలో పిల్లలు ఉన్నపుడు మీ ఆలోచనలు వేరుగా ఉంటాయని చెప్పుకొచ్చింది. నిన్న మొన్నటి వరకు ముంబైలో ఉన్న సన్నిలియోన్ యూఎస్‌కు ఎలా వెళ్లిందో తెలియక అందరు నోరెళ్ల బెడుతున్నారు. ప్రభుత్వం కన్నుగప్పి ఆమె ఎలా దేశం విడిచి వెళ్లిందో తెలియక తికమక పడుతున్నారు. ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగంలో ఎవరు ఒకరు సహకరించకపోతే.. సన్ని లియోన్ దేశం విడిచి వెళ్లడం అంత ఈజీ కాదంటున్నారు చాలా మంది నెటిజన్స్.
ప్రస్తుతం సన్ని లియోన్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని వాళ్ల ఇంట్లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. ఒకవేళ మా అమ్మ ఉండి ఉంటే ఇలానే చేయమని నాకు సలహా ఇచ్చేదంటూ చెప్పుకొచ్చింది. సన్ని లియోన్ భర్త డేనియల్ ఇంటి పరిసరాల్లో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. క్వారంటైన్ పార్ట్ 2 అంటూ ట్వీట్ చేసాడు. మొత్తానికి సన్ని లియోన్ దేశం విడిచి అమెరికాకు ఎలా పయనమైందనే విషయం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. సన్ని లియోన్ విషయానికొస్తే.. హిందీలో జిస్మ్ 2 చిత్రంతో పరిచయమైంది. తెలుగులో ‘కరెంట్ తీగ’ చిత్రంలో అతిథిగా పరిచయమైంది. ఆ తర్వాత గరుడ వేగ చిత్రంలో డియో డియో సాంగ్‌లో అలరిచింది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government, Corona virus, Covid-19, Sunny Leone, Tollywood, Us