చెట్టు ఎక్కిన సన్నీ లియోన్... ఆ తర్వాత ఏం చేసిందంటే..

Sunny Leone : సన్నీ లియోన్.. అందాల హాట్ స్టార్ తెలిసిందే. ఆమె పేరు వింటే చాలు గూగుల్ కూడా వేడెక్కిపోతుంది.

news18-telugu
Updated: February 3, 2020, 2:03 PM IST
చెట్టు ఎక్కిన సన్నీ లియోన్... ఆ తర్వాత ఏం చేసిందంటే..
Instagram/sunnyleone
  • Share this:
సన్నీ లియోన్.. అందాల హాట్ స్టార్ తెలిసిందే. ఆమె పేరు వింటే చాలు గూగుల్ కూడా వేడెక్కిపోతుంది. అంత ఫాలోయింగ్ ఉన్నఈ భామ ఎప్పటికప్పుడు సంచలన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఈ భామ అటు హిందీ సినిమాల్లో నటిస్తూనే తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ అదరగొట్టింది. ఈ భామ తాజాగా తెలుగు యువ హీరో నవదీప్‌తో రొమాన్స్ చేస్తోంది. హిందీ నిర్మాణ సంస్థ ఆల్ట్ బాలాజీ హిందీలో "రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్" అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇదే పేరుతో ఈ సంస్థలో గతంలో "రాగిని ఎంఎంఎస్" అంటూ ఎరాటిక్ హారర్ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. అదే పేరుతో ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇందులో నవదీప్‌, సన్నీ లియోన్ కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరుపుకుంటోంది. నవదీప్ 2004లో వచ్చిన "జై" సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించాడు. ఆతర్వాత తెలుగు, తమిళ భాషలలో హీరోగా నటించిన ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్, టీవీ షోలకు వ్యాఖ్యాతగా పరిమితమైపోయాడు. అందులో భాగంగా అల్లు అర్జున్ తాజా సినిమా అల వైకుంఠపురములోలలో  ఓ పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే సన్నీ తాజాగా ఓ ఫన్నీ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. షూటింగ్ గ్యాప్‌లో ఉన్న సన్నీ ఆ వీడియోలో ఓ మామిడి చెట్టు ఎక్కి దర్జాగా చెట్టుపై పడుకుని పోజుచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

View this post on Instagram
 

Climbing and hanging around!


A post shared by Sunny Leone (@sunnyleone) on

కాగా ప్రస్తుతం సన్నీ.. ‘కోకో కోలా’ అనే హార్రర్‌ కామెడీలో నటిస్తోంది. దాంతో పాటు ‘రంగీలా’, ‘వీరమదేవి’ అనే సౌత్ ఇండియన్ ఫిల్మ్స్‌లోను నటిస్తోంది. ఇటూ రియాల్టీ షోలలో పాల్గొంటూ సన్నీ టీవీ ప్రేక్షకులను అలరిస్తోంది.
First published: February 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు