మంచు విష్ణు (Manchu Vishnu) ఈ మధ్య సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన కొంతకాలం తర్వాత నటిస్తున్న సినిమా 'గాలి నాగేశ్వర రావు' (Gali Nageswara Rao). ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. గాలి నాగేశ్వరరావు చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్ (Sunny Leone), హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) నటిస్తున్నారు. అది అలా ఉంటే మోసం చేసినందుకు సన్ని లియోన్ చేతిలో చావు దెబ్బలు తిన్నారు విష్ణు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం.. ఈ వీడియోలో మొదటగా మంచు విష్ణు నడుచుకుంటూ వస్తుంటారు. ఆయన ఆ పక్కన ఉన్న పాయల్ రాజ్‌పుత్ దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో మంచు విష్ణుని 'మీ ఫేవరేట్ ఎవరు?' కనపడని ఓ వ్యక్తి అడుగుతారు. దీనికి మంచు విష్ణు 'ఇంకెవరు పాయల్.. పాయలే నా ఫేవరేట్ అని చెబుతారు'. ఇక కాసేపటి ఇదే సీన్ రిపీట్ అవుతుంది. సన్నీలియోన్ ఓ చోట కూర్చుని ఉంటుంది. ఆమె పక్కన కూర్చుని ఉన్న విష్ణుని సేమ్ క్వశ్చన్ అడగగా.. 'ఇంకెవరు.. సన్నీనే' అంటూ సమాధానమిస్తాడు విష్ణు. ఇక చివరగా.. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు సేమ్ క్వశ్చన్ రిపీట్ చేయగా.. కాసేపు ఆలోచించిన మంచు విష్ణు.. ' హిందీ నటి ఆలియా భట్' (Alia Bhatt) అని చెప్తారు. దీంతో పక్కనున్న సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్‌లు ఇద్దరూ మంచు విష్ణుని బాదేస్తారు. అలా తమను మోసం చేసిన విష్ణుకు గుణపాఠం చెప్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ సినిమాలో ఒక పాటను విష్ణు కుమార్తెలు అరియనా, వివియానా పాడారట. సింగర్స్‌గా వాళ్ళకు తొలి పాటని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడటం విశేషం అంటున్నారు. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించారట. ఈ పాట సినిమాకి కీలకంగా ఉండనుందని అంతేకాదు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను డా. మంచు మోహన్ బాబు (Mohan Babu) ఆశీస్సులతో ఏవా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో విష్ణు మంచు నిర్మిస్తున్నారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లేను కోన వెంకట్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా, భాను, నందు డైలాగ్స్ అందిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు. మా అధ్యక్షుడు అయిన తర్వాత అసలు సినిమాలపై ఫోకస్ చేయడం లేదు మంచు విష్ణు. దానికంటే ముందు కూడా కొన్ని రోజులుగా సినిమాలు చేయడం లేదు. ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా వరస ఫ్లాపులు వస్తున్న నేపథ్యంలో గ్యాప్ తీసుకోవాలనుకున్నారు విష్ణు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నారు. ఇక విష్ణు కెరీర్ విషయానికి వస్తే.. అయితే ఒకట్రెండు మంచి విజయాలు వచ్చినా కూడా కోరుకున్న గుర్తింపు రాలేదు.
View this post on Instagram
విష్ణు ఢీ, దేనికైనా రెడీ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందుకున్న తర్వాత కూడా కెరీర్‌ను అనుకున్న దారిలో సెట్ చేసుకోలేకపోయారు. వరస సినిమాలు అయితే చేస్తున్నారు కానీ విజయాలు మాత్రం రావడం లేదు. ఆ మధ్య 50 కోట్లతో నిర్మించిన మోసగాళ్లు కూడా పెద్దగా ఉపయోగపడలేదు. భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన మోసగాళ్ళు ఏమాత్రం అలరించలేకపోయింది. అయితే తన కెరీర్ ఇంత దారుణంగా ముందుకు వెళ్లడానికి.. ఇప్పటి వరకు స్టార్‌గా గుర్తింపు సంపాదించుకోకపోవడానికి ఆత్మ విశ్లేషణ చేసుకున్నారు విష్ణు. దీనికి సమాధానం ఓ షోలో చెప్పారు. కొందరు దర్శకుల కారణంగానే తన కెరీర్ ఇలా అయిపోయిందని.. తాను చేసిన కొన్ని తప్పులు.. దర్శకులను గుడ్డిగా నమ్మడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు విష్ణు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Vishnu, Payal Rajput, Sunny Leone, Tollywood news