• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SUNITHA DAUGHTER SHREYA GOPARAJU SINGS KADALALLE SONG SINGER SHARES VIDEO MNJ

Singer Sunitha: సింగ‌ర్ సునీత కుమార్తె క‌డ‌ల‌ల్లే పాట‌ను ఎంత అద్భుతంగా పాడిందో చూశారా

Singer Sunitha: సింగ‌ర్ సునీత కుమార్తె క‌డ‌ల‌ల్లే పాట‌ను ఎంత అద్భుతంగా పాడిందో చూశారా

సునీత కుమార్తె

Sunitha Daughter Shreya: పెళ్లైన త‌రువాత సింగ‌ర్ సునీత సోష‌ల్ మీడియాలో మ‌రింత యాక్టివ్ అయ్యారు. త‌న గురించిన విష‌యాల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ మ‌ధ్య‌న సునీత త‌న భ‌ర్త రామ్ వీర‌ప‌నేనితో క‌లిసి ట్రిప్‌కి వెళ్ల‌గా.. ఆ ఫొటోల‌ను కూడా అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.

  • Share this:
    Sunitha Daughter Shreya: పెళ్లైన త‌రువాత సింగ‌ర్ సునీత సోష‌ల్ మీడియాలో మ‌రింత యాక్టివ్ అయ్యారు. త‌న గురించిన విష‌యాల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ మ‌ధ్య‌న సునీత త‌న భ‌ర్త రామ్ వీర‌ప‌నేనితో క‌లిసి ట్రిప్‌కి వెళ్ల‌గా.. ఆ ఫొటోల‌ను కూడా అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోలు సునీత ఫ్యాన్స్‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సునీత ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో సునీత కుమార్తె శ్రేయ.. క‌డ‌ల‌ల్లే పాట‌ను అద్భుతంగా పాడారు. సునీత‌కు ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్న విష‌యం తెలిసిందే. వారిద్ద‌రికి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ ఇద్ద‌రు సంగీతంపై ఆస‌క్తిని చూపుతున్న‌ట్లు సునీత కూడా ప‌లు సంద‌ర్భాల్లో తెలిపారు.

    ఇక తాజాగా శ్రేయ‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ చిత్రంలోని క‌డ‌ల‌ల్లే పాట‌ను గిటార్ వాయిస్తూ ఆల‌పించారు. శ్రేయ వాయిస్ కూడా సునీత వాయిస్‌లాగానే మెలోడియ‌స్‌గా ఉండ‌గా.. ఈ పాట‌ను త‌న గాత్రంతో మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. ఇక ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్న సునీత‌.. శ్రేయ‌మ్మ అంటూ కామెంట్ పెట్టి త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచారు.




    ఇదిలా ఉంటే శ్రేయ ఇప్ప‌టికే సింగ‌ర్‌గా తానేంటో నిరూపించుకున్నారు. నాగ‌చైత‌న్య న‌టించిన స‌వ్య‌సాచి చిత్రంలో టిక్ టిక్ టిక్ అనే పాట‌ను పాడారు శ్రేయ‌. ఈ పాట‌తో అప్ప‌ట్లోనే అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. చూడాలి మ‌రి శ్రేయ కూడా సునీత అంత‌టి మంచి సింగ‌ర్ అవుతుందేమో. కాగా తన కుమారుడు, కుమార్తె ఇద్దరికీ ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ అంటే చాలా ఇష్టమని ఇటీవల సునీత తెలిపారు. ఈ మేరకు సిద్ తో వారిద్దరు తీసుకున్న ఓ ఫొటోను సునీత ఆ మధ్యన తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
    Published by:Manjula S
    First published: