హోమ్ /వార్తలు /సినిమా /

Sunitha boya: గీతా ఆర్ట్స్ ఎదుట నగ్నంగా సునీత బోయ.. మోసం జరిగిందంటూ హల్చల్

Sunitha boya: గీతా ఆర్ట్స్ ఎదుట నగ్నంగా సునీత బోయ.. మోసం జరిగిందంటూ హల్చల్

Sunitha Boya (Photo Twitter)

Sunitha Boya (Photo Twitter)

Sunitha boya Vs Bunny Vasu: తనకు అన్యాయం జరిగిందంటూ ఓ సినీ నిర్మాతపై నటి సునీత బోయ నగ్నంగా నిరసనకు దిగింది. గీతా ఆర్ట్స్ ఎదుట అర్థరాత్రి వేళ ఆమె ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అప్పట్లో శ్రీ రెడ్డి (Sri Reddy) ఎలా అయితే నడి రోడ్డుపై నగ్నంగా నానా రచ్చ చేసిందో.. ఇప్పుడు అచ్చం అలాగే మరో నటి హల్చల్ చేసింది. తనకు అన్యాయం జరిగిందంటూ ఓ సినీ నిర్మాతపై నటి సునీత బోయ (Sunitha Boya) నగ్నంగా నిరసనకు దిగింది. గీతా ఆర్ట్స్ (Geetha Arts) ఎదుట అర్థరాత్రి వేళ ఆమె ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. తెలుగులో పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, డిస్ట్రిబ్యూటర్ గా సత్తా చాటుతున్న బన్నీ వాసుపై (Bunny Vasu) ఆరోపణలు చేస్తూ సునీత బోయ నిరసన వ్యక్తం చేసింది.

గత కొంత కాలంగా గీతా ఆర్ట్స్ పై, బన్నీ వాసుపై ఆమె పదేపదే ఆరోపణలు చేస్తున్న సునీత బోయ.. ఈ సారి ఇంకాస్త రెచ్చిపోయింది. సునీత బోయను గీతా ఆర్ట్స్ సంస్థ చట్టపరంగా ఎదుర్కొంటోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమైన సునీత బోయ.. తనను నిర్మాత బన్నీవాసు వాడుకొని వదిలేశాడని ఆరోపిస్తోంది. ఈ విషయమై కోర్టు కేసులో కూడా బన్నీవాసుకే సపోర్ట్ లభించింది.

అయినప్పటికీ సునీత బోయ వదలడం లేదు. బన్నీవాసు తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ నడిరోడ్డుపై నగ్నంగా బైఠాయించింది సునీత బోయ. పోలీసులతో తనను బెదిరిస్తున్నారని, మానసికంగా వేధించడమే గాక చంపడానికి ప్రయత్నిస్తున్నారని అంటూ సంచలన విషయాలు చెబుతోంది సునీత బోయ. నాలుగు సార్లు ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్ళాను.. నా నరాలు దెబ్బతిన్నాయి అంటూ అరుస్తూ రచ్చ చేసింది. దీంతో జూబ్లీ హిల్స్ లో గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట రోడ్డుపై ఆందోళనకర వాతావరణం కనిపించింది.

బన్నీ వాసుకు శిక్ష పడేవరకు ఇక్కడినుంచి కదిలేది లేదు అంటూ సునీత రెచ్చిపోయింది. దీంతో గీతా ఆర్ట్స్ సెక్యూరిటీ విభాగం పోలిసులను సంప్రదించి సునీతపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఓ సారి ఇలాగే గీత ఆర్ట్స్ ఎదుట ఆత్మహత్య ప్రయత్నం చేసింది సునీత. సో.. చూడాలి మరి ఈ ఇష్యూపై బన్నీవాసు రియాక్షన్ ఎలా ఉంటుంది? ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందనేది!.

First published:

Tags: Geetha Arts, Tollywood, Tollywood actress

ఉత్తమ కథలు