సెకండ్ ఇన్నింగ్స్‌ నిల్.. కష్టకాలంలో సునీల్‌..

ఎందుకో తెలియదు కానీ సునీల్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం పరిస్థితులు సరిగ్గా లేవు. అతడు ఊహించిన స్థాయిలో రీ ఎంట్రీ మాత్రం సాగడం లేదు. వరసగా సునీల్ చేస్తున్న పాత్రలకు మంచి రెస్పాన్స్ అయితే రావడం లేదు. సినిమాలు వస్తున్నాయి.. కారెక్టర్స్ చేస్తున్నాడు కానీ మునపటి స్థాయిలో మాత్రం మాయ చేయడం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 17, 2018, 4:12 PM IST
సెకండ్ ఇన్నింగ్స్‌ నిల్.. కష్టకాలంలో సునీల్‌..
సునీల్ శ్రీనువైట్ల
  • Share this:
సునీల్ రీ ఎంట్రీ మామూలుగా ఉండ‌దు.. నా సినిమాలో మ‌ళ్లీ పూర్తిగా న‌వ్వులు పూయించేస్తాడు.. అత‌డి కారెక్ట‌ర్ అలా పేలుతుంది.. అదీ ఇదీ అంటూ చాలానే గొప్ప‌లు చెప్పాడు శీనువైట్ల‌. ఈయ‌న "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ" సినిమాలో సునీల్ పాత్ర‌పై చాలానే విష‌యాలు చెప్పాడు. కానీ సినిమా విడుద‌లైన త‌ర్వాత ఇప్పుడు అస‌లు విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. అస‌లు టైమ్ ఏంటో కానీ సునీల్ రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత చేస్తున్న సినిమాల‌న్నీ ఏదీ పేల‌డం లేదు.

Sunil disappointed with Amar Akbar Anthony result.. ఎందుకో తెలియదు కానీ సునీల్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం పరిస్థితులు సరిగ్గా లేవు. అతడు ఊహించిన స్థాయిలో రీ ఎంట్రీ మాత్రం సాగడం లేదు. వరసగా సునీల్ చేస్తున్న పాత్రలకు మంచి రెస్పాన్స్ అయితే రావడం లేదు. సినిమాలు వస్తున్నాయి.. కారెక్టర్స్ చేస్తున్నాడు కానీ మునపటి స్థాయిలో మాత్రం మాయ చేయడం లేదు. sunil amar akbar anthony,sunil second innings,sunil flop show,aravinda sametha sunil,ravi teja sunil,సునీల్ రీ ఎంట్రీ,కమెడియన్ సునీల్,సునీల్ రీ ఎంట్రీ ఫ్లాప్,అరవింద సమేత,అమర్ అక్బర్ ఆంటోనీ సునీల్,రవితేజ సునీల్,ఎన్టీఆర్ సునీల్
సునీల్ ఫేస్‌బుక్ ఫోటో

8 ఏళ్ళ త‌ర్వాత క‌మెడియ‌న్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే "అర‌వింద స‌మేత"లో సునీల్ నుంచి ఎంతో కామెడీ ఊహించారు ప్రేక్ష‌కులు. పైగా త్రివిక్ర‌మ్ సినిమా క‌దా క‌డుపులు చెక్క‌లు కావ‌డం ఖాయం అనుకున్నారు. కానీ సునీల్ క‌మెడియ‌న్ కాదు అని షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్. "అర‌వింద స‌మేత‌"లో అంతా సునీల్ క‌మెడియ‌న్‌గా కుమ్మేస్తాడు.. మ‌ళ్లీ "నువ్వు నాకు న‌చ్చావ్"లో బంతి టైప్‌లో న‌వ్వులు పూయిస్తాడు అనుకున్న వాళ్ల‌కు క‌మెడియ‌న్‌గా కాకుండా కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇప్పించాడు.

Sunil disappointed with Amar Akbar Anthony result.. ఎందుకో తెలియదు కానీ సునీల్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం పరిస్థితులు సరిగ్గా లేవు. అతడు ఊహించిన స్థాయిలో రీ ఎంట్రీ మాత్రం సాగడం లేదు. వరసగా సునీల్ చేస్తున్న పాత్రలకు మంచి రెస్పాన్స్ అయితే రావడం లేదు. సినిమాలు వస్తున్నాయి.. కారెక్టర్స్ చేస్తున్నాడు కానీ మునపటి స్థాయిలో మాత్రం మాయ చేయడం లేదు. sunil amar akbar anthony,sunil second innings,sunil flop show,aravinda sametha sunil,ravi teja sunil,సునీల్ రీ ఎంట్రీ,కమెడియన్ సునీల్,సునీల్ రీ ఎంట్రీ ఫ్లాప్,అరవింద సమేత,అమర్ అక్బర్ ఆంటోనీ సునీల్,రవితేజ సునీల్,ఎన్టీఆర్ సునీల్
సునీల్ త్రివిక్రమ్
ఇక దానికంటే ముందు న‌టించిన సిల్లీఫెలోస్ కూడా డిజాస్ట‌ర్ అయింది. "అర‌వింద స‌మేత" బాగానే ఆడినా అందులో సునీల్ క‌మెడియ‌న్ కాదు. ఇక ఇప్పుడు విడుద‌లైన శ్రీనువైట్ల మాత్రం "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ"లో సునీల్ ను ప‌క్కా క‌మెడియ‌న్ పాత్రకే తీసుకున్నారు. కానీ ఇప్పుడు కూడా సీన్ సితార అయిపోయింది. ఇందులో కూడా సునీల్ పాత్ర ఊహించిన స్థాయిలో లేదు.. ఏదో పర్లేదు అన్నట్లుగా ఉంది కానీ పాత సునీల్ మాదిరి కడుపులు చెక్కలు చేసే కామెడీ మాత్రం లేదు.

Sunil disappointed with Amar Akbar Anthony result.. ఎందుకో తెలియదు కానీ సునీల్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం పరిస్థితులు సరిగ్గా లేవు. అతడు ఊహించిన స్థాయిలో రీ ఎంట్రీ మాత్రం సాగడం లేదు. వరసగా సునీల్ చేస్తున్న పాత్రలకు మంచి రెస్పాన్స్ అయితే రావడం లేదు. సినిమాలు వస్తున్నాయి.. కారెక్టర్స్ చేస్తున్నాడు కానీ మునపటి స్థాయిలో మాత్రం మాయ చేయడం లేదు. sunil amar akbar anthony,sunil second innings,sunil flop show,aravinda sametha sunil,ravi teja sunil,సునీల్ రీ ఎంట్రీ,కమెడియన్ సునీల్,సునీల్ రీ ఎంట్రీ ఫ్లాప్,అరవింద సమేత,అమర్ అక్బర్ ఆంటోనీ సునీల్,రవితేజ సునీల్,ఎన్టీఆర్ సునీల్
సునీల్ అల్లరి నరేష్

ఈ చిత్రం కూడా దారుణ‌మైన టాక్ తెచ్చుకోవ‌డంతో సునీల్ రీ ఎంట్రీ ఇంకా విజ‌యం లేకుండానే ఉండిపోయింది. వెన‌క్కి వ‌చ్చి కుమ్మేద్దాం అనుకుంటున్న సునీల్ కెరీర్‌కు ఇది పెద్ద షాకే. ఇప్ప‌టికే ఆశ‌లు పెట్టుకున్న రెండు పెద్ద సినిమాలు హ్యాండిచ్చాయి. దాంతో ఇప్పుడు రాబోయే సాయిధ‌ర‌మ్ తేజ్ "చిత్ర‌ల‌హ‌రి".. శ‌ర్వానంద్ "ప‌డిప‌డి లేచే మ‌న‌సు" సినిమాల‌పైనే ఈ క‌మెడియ‌న్ ఆశ‌లు ఉన్నాయి. మ‌రి చూడాలిక‌.. వాటితో అయినా ఈ క‌మెడియ‌న్ జాత‌కం మారుతుందో లేదో..?
First published: November 17, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading