హోమ్ /వార్తలు /సినిమా /

Bujji Ila Raa Movie Review: ‘బుజ్జి ఇలా రా’ రివ్యూ.. థ్రిల్లింగ్ సైకో డ్రామా

Bujji Ila Raa Movie Review: ‘బుజ్జి ఇలా రా’ రివ్యూ.. థ్రిల్లింగ్ సైకో డ్రామా

బుజ్జి ఇలా రా రివ్యూ (Bujji Ila raa movie review)

బుజ్జి ఇలా రా రివ్యూ (Bujji Ila raa movie review)

Bujji Ila Raa Movie Review: సునీల్, ధనరాజ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా బుజ్జి ఇలా రా. సైకోయిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది.. ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా..? ఇవన్నీ రివ్యూలో చూద్దాం..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మూవీ రివ్యూ: బుజ్జి ఇలా రా

నటీనటులు: సునీల్, ధనరాజ్, చాందిని తమిళరసన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

సంగీత దర్శకుడు: సాయి కార్తీక్

సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి

ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్

దర్శకత్వం : గరుడవేగ అంజి

నిర్మాతలు: అగ్రహారం నాగి రెడ్డి, ఎన్. సంజీవ రెడ్డి

రిలీజ్ డేట్: 02/09/2022

సునీల్, ధనరాజ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా బుజ్జి ఇలా రా. సైకోయిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది.. ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా..? ఇవన్నీ రివ్యూలో చూద్దాం..

కథ:

వరంగల్‌ పట్టణంలో వరసగా పిల్లలు కిడ్నాప్ అవుతుంటారు.. అందులో కొందరు చంపబడుతుంటారు. పైగా కిడ్నాప్ అయిన పిల్లలందరూ కూడా అమ్మాయిలు.. అందులోనూ 8 ఏళ్ల వయసు వాళ్లే ఉంటారు. ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ వరంగల్ టూ టౌన్ సిఐ కేశవ(ధనరాజ్) చూసుకుంటాడు. అప్పుడే సీఐ అయ్యిన ఈయనకు పిల్లల కేసు వస్తుంది. ఈ కేసు నడుస్తుండగానే.. మధ్యలోకి మరో సిఐ ఖయ్యూమ్ (సునీల్) కూడా ఇదే కేసు చేధించడానికి వస్తాడు. మరి ఈ దారుణాలు వెనుక ఉంది ఎవరు.. పిల్లల కేసు సాల్వ్ అయిందా.. అయితే ఎవరు చేసారు అనేది మిగిలిన కథ..

కథనం:

కొన్ని సినిమాలు కేవలం సరిగ్గా ప్రమోషన్ లేనందుకే ఎవరికీ కనిపించకుండా ఉంటాయి. అందులో బుజ్జి ఇలా రా సినిమా కూడా ఉంటుంది. నిజానికి ఈ సినిమా వస్తున్నట్లు చాలా మందికి ఐడియా లేదు కానీ మంచి కంటెంట్‌తోనే వచ్చింది ఇది. ముఖ్యంగా సైకో థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు మంచి ఛాయిస్‌గానే ఉంటుంది బుజ్జి. కాకపోతే వయోలెన్స్ మితిమీరి ఉండటం ఈ సినిమాకు ప్రధానమైన మైనస్. సినిమా మొదలవ్వడమే చాలా ఆసక్తికరంగా మొదలు పెట్టాడు దర్శకుడు అంజి. స్క్రీన్ ప్లే బాగానే అనిపించినా.. సీన్స్ మాత్రం బలంగా లేవు. చాలా పకడ్బందీగా సాగాల్సిన చోట.. సాదాసీదాగా వదిలేసారు. ఫస్టాఫ్ అంతా పిల్లల్ని కిడ్నాప్ చేయడం.. ఆ బ్యాచ్‌ను పట్టుకోడానికి ధనరాజ్ ప్రయత్నించడం వరకు బాగున్నాయి. ఇంటర్వెల్ అదిరిపోయే ట్విస్టు ఇచ్చినా.. సెకండాఫ్ కాస్త తగ్గింది. ముఖ్యంగా క్లైమాక్స్ డిజైనింగ్ బాగుంది కానీ వయోలెన్స్ ఎక్కువగా ఉంది. మరో ఆప్షన్స్ కూడా దర్శకుడి ముందున్నా.. ఆయన మాత్రం కేవలం హింస వైపు అడుగేసాడు. ఆర్టిస్టుల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని.. ప్రమోషన్ బాగా చేసుకుని ఉండుంటే బుజ్జి ఇలారా నిజంగానే మంచి సినిమా అయ్యుండేది.

ప్లస్ పాయింట్స్:

సునీల్, ధనరాజ్ నటన

ఫస్టాఫ్ థ్రిల్లింగ్ సీన్స్

ఇంటర్వెల్ బ్యాంగ్

మైనస్ పాయింట్స్:

మరీ ఎక్కువగా వయోలెన్స్

బ్యాగ్రౌండ్ స్కోర్

క్లైమాక్స్

నటీనటులు:

సునీల్ ఆకట్టుకున్నాడు.. కమెడియన్‌గా కాకుండా చాలా సీరియస్ పాత్రలో నటించాడు ఈయన. అందులో మెప్పించాడు కూడా. ఇక ధనరాజ్ కూడా తన పాత్ర వరకు చాలా బాగా నటించాడు. సిఐగా పవర్ చూపిస్తూనే.. తండ్రిగా ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. ఆయన భార్యగా నటించిన చాందిని భయపెట్టేసింది. ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయి. శ్రీకాంత్ అయ్యాంగార్‌కు కూడా మంచి పాత్ర దొరికింది. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీమ్:

సాయి కార్తిక్ పాటలు బాగున్నాయి కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం మరీ భయంకరంగా ఉంది. సీన్స్‌కు మించి లౌడ్‌గా అనిపించింది. కాస్త శృతిలో ఉండుంటే బాగుండేది. ఎడిటింగ్ పర్లేదు.. సెకండాఫ్ ఇంకాస్త వేగంగా ఉండి.. క్లైమాక్స్‌లో రక్తపాతం తగ్గించి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది.. ఉన్నంతలో రిచ్‌గా అనిపిస్తుంది. దర్శకుడు గరుడవేగ అంజి కథ బాగానే రాసుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. జి నాగేశ్వరరెడ్డి టీమ్ కంటెంట్ బాగా రాసుకున్నా.. ప్రజెంటేషన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్లేదు.

చివరగా ఒక్కమాట:

బుజ్జి ఇలా రా.. క్రైమ్ సైకో సినిమాలకు ఇష్టపడే వాళ్లకు నచ్చుతుంది..

రేటింగ్: 2.5/5

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Movie reviews, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు