‘తెనాలి రామకృష్ణ’ మూవీ రివ్యూ.. మరో ‘చెట్టు కింద ప్లీడర్’..

‘తెనాలి రామకృష్ణ’ మూవీ రివ్యూ (File Photo)

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత సరైన సక్సెస్ లేని సందీప్ కిషన్.. ఈ మధ్యనే ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో పర్వాలేదనపించాడు. తాజాగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమాతో సందీప్ కిషన్ తాను కోరకున్న సక్సెస్ అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

  • Share this:
    నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ,మురళీ శర్మ,సప్తగిరి, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, వెన్నెల కిషోర్ తదితరులు

    నిర్మాణం: SNS క్రియేషన్స్

    సంగీతం: సాయి కార్తీక్

    దర్శకత్వం: జి.నాగేశ్వర్ రెడ్డి

    ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత సరైన సక్సెస్ లేని సందీప్ కిషన్.. ఈ మధ్యనే ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో పర్వాలేదనపించాడు. తాజాగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమాతో సందీప్ కిషన్ తాను కోరకున్న సక్సెస్ అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

    కథ విషయానికొస్తే..

    తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) చెట్టు కింద  ప్లీడర్ టైపు లాయర్. కేసులు లేక ఈగలు తోలుకునే టైపు అన్న మాట. అలాంటి తెనాలి రామకృష్ణ అనుకోకుండా ఒక మర్డర్ కేసు టేకప్ చేస్తాడు. ఆ కేసును అప్పటి వరకు అపజయం ఎరగని ఒక లాయర్ (మురళీ శర్మ)పై ఆ కేసును గెలుస్తాడు. ఐతే... ఈ మర్డర్ కేసులో ఓ మిస్టరీ ఉంది. దాన్ని తెనాలి రామకృష్ణ ఎలా ప్రాబ్లెమ్ సాల్వ్ చేసాడనేదే ఈ సినిమా స్టోరీ.

    నటీనటుల విషయానికొస్తే..

    సందీప్ కిషన్.. చెట్టు కింద ప్లీడర్ టైపు తెనాలి రామకృష్ణ క్యారెక్టర్‌లో పర్వాలేదనిపించాడు. ఇప్పటి వరకు తనలో సీరియస్ యాక్టరే కాదు కామెడీ ఉందని ఈ సినిమాతో నిరూపించాడు. అక్కడక్కడ రాజేంద్ర ప్రసాద్, అల్లరి నరేష్‌లను ఇమిటేట్ చేసినట్టు ఉన్న తనదైన కామెడీ టైమింగ్ పండించాడు. హీరోయిన్‌గా నటించిన హన్సిక మరో లాయర్ పాత్రలో నటించినా.. కేవలం గ్లామర్ షోకు మాత్రమే పనికొచ్చింది. ఇక మరో ముఖ్యపాత్రలో నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది. అంతేకాదు తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక సీనియర్ లాయర్ పాత్రలో మురళీ శర్మ నటన బాగుంది. ఇంకోవైపు సప్తగిరి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్ ఉన్నంతలో బాగానే నవ్వించారు.

    టెక్నికల్ విషయానికొస్తే.. 

    దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి తనకు మాత్రమే తెలిసిన కామెడీ జానర్‌లో ఈసినిమాను తెరకెక్కించాడు. తనదైన శైలిలో కామెడీ పంచ్‌లు సన్నివేశాలు అల్లుకోవడంలో బాగనే ఉన్నా.. సెకండాఫ్ వచ్చేసరికి తనదైన కామెడీని పక్కనపెట్టి.. సినిమాను పూర్తిగా సీరియస్ మూడ్‌లోకి తీసుకెళ్లాడు. నిర్మాణ పరంగా బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అక్కడ అక్కడ లాజిక్‌లు మిస్సైయిన మాస్ ప్రేక్షకులను మాత్రం అలరించేలా ఉంది.

    ప్లస్ పాయింట్స్..

    ఫస్టాఫ్ కామెడీ

    సందీప్ కిషన్ నటన

    మైనస్ పాయింట్స్ 

    కథనం

    సెకండాప్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం

    రేటింగ్: 2.5/5

    చివరి మాట: నవ్వించే చెట్టు కింద ప్లీడరు ‘తెనాలి రామకృష్ణ’
    Published by:Kiran Kumar Thanjavur
    First published: