• Home
 • »
 • News
 • »
 • movies
 • »
 • SUNDEEP KISHAN NEW MOVIE TENALI RAMAKRISHNA TEASER RELEASED COMMENTS ON RAMCHARAN VINAYA VIDHEYA RAMA MK

తెనాలి రామకృష్ణ సాక్షిగా రామ్‌చరణ్‌పై పంచులు వేసిన సందీప్ కిషన్...

సందీప్ కిషన్, హన్సిక

టీజర్ లో కమెడియన్ సప్తగిరి వార్నింగ్ ఇస్తూ "వాడి తల ఎగిరాల్సిందే...గద్దలు ఎత్తుకెళ్లాల్సిందే" అంటూ వేసిన కామెడీ పంచ్ వివాదాస్పదం అవుతోంది. అయితే పంచు ఇటీవల బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన రామ్ చరణ్ చిత్రం వినయవిధేయ రామను ఉద్దేశించి చేసిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

 • Share this:
  సందీప్ కిషన్ హీరోగా హన్సిక, వరలక్ష్మి శరత్ కుమార్ సరసన నటిస్తున్న కొత్త సినిమా తెనాలి రామకృష్ణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. కామెడీ జోనర్ గా వస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ దేశముదురు భామ హన్సిక, వరలక్ష్మి శరత్ కుమార్ తొలిసారి నటిస్తుండగా, జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో వదిలిన కామెడీ పంచులు మెగా అభిమానులకు చురకత్తుల్లా గుచ్చుకుంటున్నాయి. టీజర్ లో కమెడియన్ సప్తగిరి వార్నింగ్ ఇస్తూ "వాడి తల ఎగిరాల్సిందే...గద్దలు ఎత్తుకెళ్లాల్సిందే" అంటూ వేసిన కామెడీ పంచ్ వివాదాస్పదం అవుతోంది. అయితే పంచు ఇటీవల బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన రామ్ చరణ్ చిత్రం వినయవిధేయ రామను ఉద్దేశించి చేసిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

  వినయ విధేయ రామ చిత్రంలో హీరో రామ్ చరణ్ విలన్స్ తలలు నరకగానే గాల్లోకి లేచిన తలల్ని గద్దలు ఎత్తుకెళ్లిన సీన్ విమర్శల పాలైంది. అయితే మెగా అభిమానులకు పీడకలలా నిలిచిపోయిన ఈ సినిమా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ మరోసారి ఆ సినిమాను గుర్తు చేసింది.  First published: