• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SUNDEEP KISHAN LAVANYA TRIPATHI A1 EXPRESS TWITTER REVIEW SR

A1 Express Twitter Review : సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

A1 Express Twitter Review : సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

Sandeep Kishan A1Express Twitter Review Photo : Twitter

A1 Express Twitter Review : సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌కిషన్‌ , దయా పన్నెం కలిసి నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా.. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

  • Share this:
    సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రల్లో డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌కిషన్‌ , దయా పన్నెం కలిసి నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా.. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. గతేడాదే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ మధ్య సరైన విజయాలు లేక సతమతమవుతోన్న సందీప్ కిషన్ ఈ సినిమాతో ఏలాగైనా హిట్ కొట్టాలనీ కసిగా ఉన్నాడు. ఇందుకు సందీప్ కిషన్ ఓ స్పోర్ట్స్ బ్యాగ్ గ్రౌండ్‌ను ఎంచుకున్నాడు. ఇక ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ టీజర్‌లు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ అయిన ‘నట్పె తునై’కు తెలుగు రీమేక్‌గా వస్తోంది. అక్కడ ఈ సినిమా తమిళ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. చూడాలి మరి తెలుగులో ఎలా ఉండనుందో.. తెలుగు వారు ఎంతవరకు ఆదరిస్తారో.. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హాకీ ఆటకు సంబంధించిన ప్లేగ్రౌండ్ చుట్టూ ఉంటుంది. దాన్ని కాపాడుకునేందుకు ఓ కోచ్ చేసే ప్రయత్నం.. కోచ్‌కు తోడుగా ఆట నుంచి నిషేధింపబడ్డ ఓ ఆటగాడుగా సందీప్ కిషన్.. ఇలా ఆకట్టుకునే సీన్స్‌తో ఉంటుంది.

    సందీప్ కిషన్ ఎందుకు హాకీ ఆట నుంచి బ్యాన్ చేయబడ్డాడు.. దీనికి గల కారణాలు ఏంటీ.. హీరో తిరిగి హాకీ స్టిక్ పడతాడా.. సందీప్ నటన ఎలా ఉంది. హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠీ ఎలా చేసింది. ఆమె రోల్ ఏంటీ.. కథ ఏ మాత్రం తెలుగు వారిని ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాల గూర్చి ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..












    ఈ సినిమాకు చాలా వరకు పాజిటివ్ బజ్ ఉంది.. సోషల్ మీడియాలో చాలా వరకు అందరూ హీరో సందీప్ కిషన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. తమిళ్ హిట్ సినిమాకు రీమేక్ కాబట్టి.. ఇక్కడ తెలుగు వారిని కూడా అలరించే అవకాశం ఎక్కువ.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు