• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SUNDEEP KISHAN A1 EXPRESS MOVIE HAD A SIMILARITY WITH SHAH RUKH KHAN CLASSIC CHECK DE INDIA PK

Sundeep Kishan A1 Express: షారుక్ ఖాన్ చక్ దే ఇండియాతో సందీప్ కిషన్ సినిమాకు లింక్..

సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్ (sundeep kishan a1 express)

Sundeep Kishan A1 Express: అదేంటి.. షారుక్ ఖాన్ సినిమాకు.. సందీప్ కిషన్ సినిమాతో పోలికేంటి..? ఈ ఇద్దరికి ఎక్కడ లింక్ కుదిరింది అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది. సందీప్ కిష‌న్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'.

  • Share this:
అదేంటి.. షారుక్ ఖాన్ సినిమాకు.. సందీప్ కిషన్ సినిమాతో పోలికేంటి..? ఈ ఇద్దరికి ఎక్కడ లింక్ కుదిరింది అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది. సందీప్ కిష‌న్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆసక్తి బాగానే ఉంది. హాకీ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం కోసం ఆరు నెలలు హాకీ కోచింగ్ కూడా తీసుకున్నాడు సందీప్ కిషన్. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ సినిమాగా ఏ1 ఎక్స్‌ప్రెస్ గుర్తింపు పొందింది. ఈ చిత్రానికి ధృవ ఫేమ్ హిప్ హాప్ తమిళ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్ పాడిన "సింగిల్ కింగులం" సాంగ్ ఇప్ప‌టికే సూప‌ర్ డూపర్ హిట్ట‌యింది.
sundeep kishan new movie,a1 express new movie,sundeep kishan,sundeep kishan latest movies,sundeep kishan a1 express movie climax shoot,a1 express check de india shooting,a1 express movie trailer,sandeep kishan,sandeep kishan movie opening,sandeep kishan new movie opening video,సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్,సందీప్ కిషన్ షారుక్ ఖాన్ చెక్ దే ఇండియా షూటింగ్
సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్ (sundeep kishan a1 express)

ఇక ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ ఇండియాలోనే అతిపెద్ద‌, ఉత్త‌మ హాకీ స్టేడియం అయిన‌ పంజాబ్‌లోని మొహాలి స్టేడియంలో క్లైమాక్స్ సీక్వెన్స్‌ల‌ను పూర్తి చేశారు దర్శక నిర్మాతలు. భార‌త‌దేశ‌పు టాప్ హాకీ ఫిలిమ్స్ అయిన 'చ‌క్ దే ఇండియా', 'సూర్మ' షూటింగ్‌ల‌ను జ‌రిపింది ఈ స్టేడియంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. చక్ దే ఇండియా క్లైమాక్స్ ఎప్పటికీ మరిచిపోలేరు ఆడియన్స్. దాన్ని దర్శకుడు షిమిత్ అమీన్ తెరకెక్కించిన విధానం అద్భుతం. ఇప్పుడు సందీప్ కిషన్ సినిమాను కూడా అక్కడే తెరకెక్కించారు. ఎ1 ఎక్స్‌ప్రెస్ క్లైమాక్స్ అక్కడే పూర్తి చేసారు. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్‌లు అద్భుతంగా వచ్చినట్లు తెలిపారు దర్శక నిర్మాతలు. ఈ సీక్వెన్స్‌లో న‌టించ‌డం కోసం గ‌త ఆరు నెల‌లుగా హాకీలో శిక్ష‌ణ తీసుకుంటూ వ‌చ్చాడు సందీప్ కిష‌న్‌. ఆ ట్రైనింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి కూడా.
sundeep kishan new movie,a1 express new movie,sundeep kishan,sundeep kishan latest movies,sundeep kishan a1 express movie climax shoot,a1 express check de india shooting,a1 express movie trailer,sandeep kishan,sandeep kishan movie opening,sandeep kishan new movie opening video,సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్,సందీప్ కిషన్ షారుక్ ఖాన్ చెక్ దే ఇండియా షూటింగ్
సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్ (sundeep kishan a1 express)

చిత్రంలో హాకీ ఆడే సన్నివేశాల్లో నిజంగానే ఒక ప్రొఫెష‌న‌ల్ హాకీ ప్లేయ‌ర్ మాదిరి కనిపించాడు సందీప్. ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌డం కోసం సందీప్ కిష‌న్ పెట్టిన ఎఫెర్ట్‌ పలువురి ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే హాకీ ట్రైనింగ్‌లో 6 నెల‌లు.. క్యారెక్ట‌ర్‌లో దాదాపు ఒక ఏడాదిగా ఉండ‌టం.. 14 కిలోల బ‌రువు త‌గ్గ‌డం.. అఫ్‌కోర్స్ కొవిడ్ భ‌యపెడుతుండ‌గానే ఇప్ప‌టి వరకు నేను చేసిన చిత్రాల్లోనే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కం చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్' అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ఈ చిత్ర క్లైమాక్స్‌ ఎట్ట‌కేల‌కు పూర్తి చేశామని.. ఇంకొక్క రోజు షూటింగ్ మిగిలుందని చెప్పాడు సందీప్. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతోందని ట్వీట్ చేశాడు. ఈ సినిమాను త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో విడుదల చేయబోతున్నారు మేకర్స్.
Published by:Praveen Kumar Vadla
First published: