ఏడేళ్ళ తర్వాత సందీప్ కిషన్ సినిమాకు మోక్షం..

Sundeep Kishan: ఓటిటి పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో థియేటర్స్ అన్నీ మూత పడిపోవడంతో ఇప్పుడు చేసేదేం లేక తమ సినిమాలను ఓటిటి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2020, 6:31 PM IST
ఏడేళ్ళ తర్వాత సందీప్ కిషన్ సినిమాకు మోక్షం..
సందీప్ కిషన్ (sundeep kishan)
  • Share this:
ఓటిటి పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో థియేటర్స్ అన్నీ మూత పడిపోవడంతో ఇప్పుడు చేసేదేం లేక తమ సినిమాలను ఓటిటి వైపు మళ్లిస్తున్నారు కొందరు చిన్న నిర్మాతలు. ఎలాగూ థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్లకు అవి దొరకవని ముందుగానే ఫిక్సైపోతున్నారు. అందుకే విడుదలకు సిద్దమైన చిన్న సినిమాలను ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి తీసుకొస్తున్నారు. అందులో అమృతరామమ్‌తో పాటు మరికొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమా వస్తుందని తెలుస్తుంది. అతడే సందీప్ కిషన్..
సందీప్ కిషన్ డికే బోస్ (DK Bose movie)
సందీప్ కిషన్ డికే బోస్ (DK Bose movie)


ఈయన సినిమాలకు బాగానే క్రేజ్ ఉంటుంది కదా.. మరి ఎందుకు ఓటిటి అనుకుంటున్నారా..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 2013లో ఈయన హీరోగా తెరకెక్కిన డిజే బోస్ ఇప్పటి వరకు విడుదల కాలేదు. నిషా అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఎందుకో తెలియదు కానీ కొన్ని కారణాలతో ఈ సినిమా బాక్సుల్లోనే ఆగిపోయింది. గతేడాది నిను వీడని నీడను నేనే చిత్రంతో పర్లేదనిపించుకున్న ఈయన ప్రస్తుతం ఎన్1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో నటిస్తున్నాడు.
సందీప్ కిషన్ డికే బోస్ (DK Bose movie)
సందీప్ కిషన్ డికే బోస్ (DK Bose movie)

ఇదిలా ఉంటే అప్పుడెప్పుడో ఆగిపోయిన డీకే బోస్ సినిమాను ఇప్పుడు డిజిటల్‌లో విడుదల చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. ఎలాగూ థియేటర్స్‌కు రావడం కష్టమే కాబట్టి ఇదే బెటర్ అనుకుంటున్నారు వాళ్లు. అయితే ఇదెప్పుడు ఎలా విడుదలవుతుందనేది మాత్రం సస్పెన్స్. ఓటిటి ప్లాట్ ఫామ్‌లో ఇలాగే విడుదల చేస్తూ పోతే మాత్రం రేపు థియేటర్స్ యాజమాన్యం మాత్రం కచ్చితంగా రచ్చ చేసే అవకాశం లేకపోలేదు. మొత్తానికి చూడాలిక.. ఈ ట్రెండ్ ఎక్కడి వరకు వెళ్తుందో..?
First published: June 25, 2020, 6:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading