Sumanth Second Marriage: తన రెండో పెళ్లి పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో సుమంత్..

యార్లగడ్డ సుమంత్ (Twitter/Photo)

Sumanth Second Marriage: తన రెండో పెళ్లి పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు హీరో యార్లగడ్డ సుమంత్. సుమంత్..

  • Share this:
    Sumanth Second Marriage: తన రెండో పెళ్లి పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు హీరో యార్లగడ్డ సుమంత్. సుమంత్.. గతంలో పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ ఫేమ్ హీరోయిన్‌ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్ఫర్థలు రావడంతో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సుమంత్.. ఒంటరిగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు పవిత్ర అనే అమ్మాయితో త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు ఇద్దరు కలిసి మ్యారేజ్ కార్డులు పంచుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా తన సెకండ్ మ్యారేజ్ పై వస్తున్న వార్తలపై సుమంత స్పందించారు. అంతేకాదు తాను రెండో వివాహాం చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు.

    సుమంత్ తాను యాక్ట్ చేస్తోన్న సినిమా పెళ్లి, విడాకులకు సంబంధించిన కథతో తెరకెక్కుతోంది. ఆ సినిమా  సెట్ నుంచి ఓ పెళ్లి కార్డు లీకైనట్టు వివరించారు. దాన్నే అందరూ తన పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక అని అందరు అనుకున్నారు.


    ఈ విషయం మీడియాలో నానడంతో తాను క్లారిటీ ఇస్తున్నట్టు వివరించారు. అంతేకాదు తాను చేయబోయే కొత్త సినిమాకు సంబంధించిన పేరుతో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. మొత్తంగా గత కొన్ని రోజులుగా సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అని సుమంత్ స్వయంగా వెల్లడించడంతో ఈ విషయానికి ఇక పులిస్టాప్ పడ్టట్టే. అంతేకాదు తాను ఇక ముందు కూడా రెండో పెళ్లి చేసుకోనుగాక చేసుకోను అంటూ తన మనసులో మాట బయట పెట్డాడు. అయితే సుమంత్.. ఇదంత తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిన స్టంట్ అంటున్నారు. ఒక వేళ క్లారిటీ ఇచ్చేవాడైతే వెంటనే స్పందించేవాడు. అన్ని సైట్స్ ఈ న్యూస్ రాసిన తర్వాత జాతీయ మీడియాకు ఈ న్యూస్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చింది. అంత తను అనుకున్నట్టే జరగడంతో ఇపుడు తీరిగ్గా సుమంత్ నవ్వుతూ  క్లారిటీ ఇచ్చాడని అందరు చెప్పుకుంటున్నారు. మొత్తంగా సుమంత్ వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందని అందరు చెప్పుకుంటున్నారు.

    మామ నాగార్జునతో సుమంత్ (File/Photo)


    అక్కినేని మేనల్లుడు సుమంత్  విషయానికొస్తే.. దాదాపు 15 ఏళ్ళుగా ఈయన ఒంటరిగానే ఉంటున్నాడు. అప్పుడెప్పుడో ప్రేమకథ సినిమాతో పరిచయం అయిన సుమంత్.. ఆ తర్వాత సత్యం సినిమాతో హిట్ కొట్టి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘మళ్లీ రావా’  సినిమాతో పర్వాలేదనిపించాడు. రీసెంట్‌గా కపటధారిగా పలకరించారు. వరుసగా ఫ్లాపులు వస్తోన్న ఎక్కడ కృంగిపోకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: