హోమ్ /వార్తలు /సినిమా /

Mem Famous Twitter Review : సుమంత్ ప్రభాస్ మేమ్ ఫేమస్ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

Mem Famous Twitter Review : సుమంత్ ప్రభాస్ మేమ్ ఫేమస్ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

Mem Famous Twitter Review Photo : Twitter

Mem Famous Twitter Review Photo : Twitter

Mem Famous Twitter Review : యువ నటుడు సుమంత్ ప్రభాస్ హీరోగా స్వీయ రచనాదర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ 'మేమ్ ఫేమస్'. ఈ సినిమా ఈరోజు విడుదలఅవుతోంది. చాయ్ బిస్కెట్ అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రతో కలిసి చంద్రు మనోహర్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో దాదాపు అందరూ కొత్తవారే నటించడం విశేషం. ఇక ఈ సినిమాను చూసిన నెటిజన్స్ కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.. అసలు ఈ సినిమా కథేంటీ.. కథనం ఏలా ఉంది.. ఈ సినిమా తెలుగువారిని ఏమేరకు ఆకట్టుకోగలదు.. మొదలగు విషయాలను పంచుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

యువ నటుడు సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) హీరోగా స్వీయ రచనాదర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ 'మేమ్ ఫేమస్' (Mem Famous ). ఈ సినిమా ఈరోజు విడుదలైంది. చాయ్ బిస్కెట్ (Chai Bisket) అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రతో కలిసి చంద్రు మనోహర్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో దాదాపు అందరూ కొత్తవారే నటించడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాను చూసిన మహేష్ బాబు (Mahesh Babu) తన రివ్యూను కూడా తెలపడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఈ సినిమా టీమ్ చేసిన ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకు మంచి పాజిటివ్ బజ్‌ను తీసుకువచ్చాయి. ఇక ఈ సినిమాను చూసిన మహేష్ తన ట్విట్టర్‌లో పేర్కోంటూ..  "మేమ్ ఫేమస్ చిత్రాన్ని ఇప్పుడే చూశాను... బ్రిలియంట్ గా ఉంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాకు రచయిత, దర్శకుడు, హీరో అయిన సుమంత్ ప్రభాస్ ఇరగదీశాడని.. ఏం టాలెంట్! విజువల్స్ కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంత అదిరిపోయిందని అన్నారు.

ఇక ఈ సినిమాను చూసిన నెటిజన్స్ కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.. అసలు ఈ సినిమా కథేంటీ.. కథనం ఏలా ఉంది.. ఈ సినిమా తెలుగువారిని ఏమేరకు ఆకట్టుకోగలదు.. మొదలగు విషయాలను పంచుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..

నెటిజన్స్ కామెంట్స్ ప్రకారం.. సినిమా బాగానే ఉందని తెలుస్తోంది. ఈసినిమాలో ఇటు కామెడీతో పాటు సెంటిమెంట్ సీన్స్ వర్కౌట్ అయ్యాయాని తెలుస్తోంది. అందరూ కొత్తవారు అయ్యిన కూడా అదరగొట్టారని అంటున్నారు. చూడాలి మరి లాంగ్ రన్‌లో ఎలా ఆకట్టుకోనుందో..

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంగా సాగుతుంది ఈ కథ. మహీ, బాలీ, దుర్గ ముగ్గురు చిన్నప్పటి నుంచి ఒకే ఊర్లో పెరిగిన మంచి స్నేహితులు. ఈ ముగ్గురు ఎలాంటి బాధ్యతలు లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటారు. మహీ తన మరదలను ప్రేమిస్తాడు.. అయితే మేనమామ కుదరదంటాడు.. దీంతో వీరికి ఊర్లో కొన్ని సమస్యలు వస్తాయి. దీంతో ఈ ముగ్గురు స్నేహితులు ఏదో ఒక పని చేయాలని నిర్ణయించుకొని ఓ టెంట్ హౌస్‌ను స్టార్ట్ చేస్తారు. అల్లరి పనుల మానేసి టెంట్ హౌజ్ పెట్టిన ఈ ముగ్గురి ఆ తర్వాత ఎలాంటి అనుభవం ఎదురైంది. ముగ్గురి జీవితాలకు టెంట్ హౌజ్ రూపంలో ఎదురైన ఛాలెంజ్ ఏంటీ.. తన మరదలు మౌనికతో మహీ లవ్ లైఫ్ ఎలా సాగింది.. అనేది కథ.

నటీనటుల విషయానికి వస్తే.. సుమంత్ ప్రభాస్ , మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, అంజి మామ, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు. రచన, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్, నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్, కళ్యాణ్‌ నాయక్‌ సంగీతం అందించారు.

First published:

Tags: Tollywood, Tollywood news

ఉత్తమ కథలు