Home /News /movies /

SUMANTH LATEST MOVIE MALLI MODALAINDI TO STREAM DIRECTLY ON ZEE5 HERE ARE THE DETAILS SR

Zee5| Malli Modalaindi : డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల కానున్న‌ సుమంత్ మళ్ళీ మొదలైంది..

Malli modalaindi Photo : Twitter

Malli modalaindi Photo : Twitter

Zee5| Malli Modalaindi : అక్కినేని హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ సినిమా 'మళ్ళీ మొదలైంది'.. డైరెక్ట్‌గా ఓటీటీ విడుదలను ఎంచుకుంది. ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ 'జీ 5'లో స్ట్రీమింగ్ కానుంది.

    అక్కినేని హీరో సుమంత్ (Sumanth) నటించిన లేటెస్ట్ సినిమా 'మళ్ళీ మొదలైంది'( Malli Modalaindi).. డైరెక్ట్‌గా ఓటీటీ విడుదలను ఎంచుకుంది. ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ 'జీ 5'లో స్ట్రీమింగ్ కానుంది. జీ5 (Zee5) విషయానికి వస్తే.. జీ5 ఓటీటీ లక్ష్యం ఒక్కటే... వీక్షకులకు వినోదం అందించడమే. అది కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా... ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డమే లక్ష్యంగా 'జీ 5' ఓటీటీ ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను అందిస్తోంది. లేటెస్టుగా మరో సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది.

    సుమంత్ (Sumanth) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'మళ్ళీ మొదలైంది' (Malli Modalaindi). టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను 'జీ 5' ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.




    విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా 'మళ్ళీ మొదలైంది' (Malli Modalaindi). ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో ముఖ్య కథానాయికగా నైనా గంగూలీ నటించారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

    Shyam Singha Roy : చిరంజీవికి నచ్చిన శ్యామ్ సింగ రాయ్.. ఇంకొన్ని గంటల్లో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..

    సిద్ శ్రీరామ్ పాడిన 'ఎలోన్ ఎలోన్'కు అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాకు చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవో. 'జీ 5' ఓటీటీలో ఈ నెల 21న 'లూజర్' సీజన్ 2 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'మళ్ళీ మొదలైంది' (Malli Modalaindi)తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Hero sumanth, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు