భర్త అంబరీష్‌ను తలుచుకొని భావొద్వేగానికి లోనైన సుమలత..

sumalatha ambarish | ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు సుమలత అంబరీష్..తన భర్త రెబల్ స్టార్ అంబరీష్‌ను తలుచుకొని కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు.

news18-telugu
Updated: August 25, 2019, 8:38 PM IST
భర్త అంబరీష్‌ను తలుచుకొని భావొద్వేగానికి లోనైన సుమలత..
తన భర్త అంబరీష్‌తో సుమలత (Facebook/Photo)
  • Share this:
ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు సుమలత అంబరీష్..తన భర్త రెబల్ స్టార్ అంబరీష్‌ను తలుచుకొని కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త అంబరీష్ ఈ లోకాన్ని విడిచి తొమ్మిది నెలలు అవుతుందని నటి సుమలత ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రముఖ కన్నడ నటుడు, పొలిటిషియన్ అయిన అంబరీష్ గతేడాది నవంబర్ 24న హార్ట్ ఎటాక్‌తో కన్నుమూసారు. ఆయన లేరనే విషయాన్ని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కన్నుమూసి తొమ్మిది నెలలు అవుతున్న సందర్భంగా సుమలత తన ఫేస్‌బుక్ ‌తన భర్తను తలుచుకుంటూ పోస్ట్ చేసింది.ఈ శనివారానికి అంబరీష్.. నా నుంచి దూరమయ్యి తొమ్మిది నెలలు అవుతోంది. నువ్వులేని ఈ కాలం నాకు జీవితంలో ఆటుపోట్లు ఎలా ఉంటాయో నేర్పింది. నీతో గడిపిన 27 ఏళ్లు ఒక మధుర స్వప్నం అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నీతో ఉన్న అన్నేళ్ల జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. నాకు తెలిసి మీరు ఎక్కడున్న .. నీ చుట్టు ఉన్న వారిని సంతోషాన్నిపంచుతారని అనుకుంటున్నాను అంటూ ఆయనతో దిగిన పాత ఫోటోను పోస్ట్ చేసింది. సుమలత విషయానికొస్తే.. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్యా లోక్‌సభ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా గెలిచారు. ఈ ఎన్నికల్లో తన సమీప జెడీఎస్ అభ్యర్ధి నిఖిల్ గౌడను ఓడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా.First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>