యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ యాంకర్ అయిన సుమకు ఎలాంటి కష్టమైన ప్రశ్న వేసినా.. చాలా తెలివైన సమాధనం ఇచ్చి అందులో నుంచి ఈజీగా బయటపడుతోంది. సుమ అక్క ఇటీవలే జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సుమ అనేకరకాల ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ క్రమంలో సింగర్ సునీత... సుమను చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సునీత, సుమ మధ్య జరిగిన సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అయితే సునీత సుమకు ఓ క్లిష్టమైన ప్రశ్న వేసింది. ‘సుమ నీకు ఓ ఫోన్ కాల్ వచ్చి.. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వస్తుంది. అదే సమయంలో నీ భర్త రాజీవ్ కూడా హీరోగా ఓ సినిమా తీస్తున్నాను అందులో నా హీరోయిన్ నువ్వు తప్ప వేరేవర్ని పెట్టుకోలేను అంటాడు అప్పుడు నువ్వు ఎవరితో సినిమా చేస్తావు అంటూ సునీత సుమను ఇరకాటంలో పెట్టే ప్రశ్న వేసింది. దీనికి సుమ.. ఇదిగో ఇది చాలా కాంట్రో వర్షియల్ సమాధానం అవుతుంది. కాబట్టి నేను చెప్పబోయేది జాగ్రత్త అంటూ.. సుమ చాలా తెలివిగా తన సమాధానం ఇచ్చేసింది.
View this post on Instagram
రాజా రియల్ లైఫ్‌లో నేనే నీ హీరోయిన్ కాబట్టి..ఈ సారికి పవన్ కళ్యాణ్ గారి సినిమా చేస్తా అంటూ.. చాలా ఈజీగా ఆన్సర్ ఇచ్చేసింది సుమ. సుమ సమాధానానికి సింగర్ సునీత చప్పట్లు కొట్టి మరి ఎంజాయ్ చేశారు. ఇక సుమ ఫ్యాన్స్ కూడా.. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కరెక్ట్ సమాధానం అని కొందరు నెటిజన్లు అంటుంటే.. చాలా ఇంటిలిజెంట్‌గా సమాధానం చెప్పిందని మరికొందరు అంటున్నారు.
ఇక సుమ నటించిన జయమ్మ పంచాయతీ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. గడుసైన మహిళ పాత్ర జయమ్మగా ఆమె నటించింది. ఉన్నట్టుండి పంచాయితీకి జయమ్మ ఎందుకు వెళ్లింది? గుండె సమస్యతో బాధపడుతున్న తన భర్త ప్రాణాలు దక్కించుకోవడానికి ఏం చేసింది లాంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సుమ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. బలగా ప్రకాశ్ నిర్మాతగా వ్యవహరించారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మే 6న జయమ్మ పంచాయతీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం సుమ జోరుగా ప్రమోషన్లు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Pawan kalyan, Rajiv Kanakala, Singer Sunitha