Suma - Rajiv Kanakala: టాలీవుడ్లో హీరోయిన్స్‌తో సమానమైన ఫాలోయింగ్ ఉన్న యాంకర్స్‌లో సుమ కనకాల తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చలాకైన మాటలతో అలరించే సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే అపుడపుడు సినిమాల్లో నటిస్తుంది. ఇక ఈమె దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కళ్యాణ్ ప్రాప్తిరస్తు’ సినిమాతో వెండితెరకు పరిచమైంది. ఈమె జన్మత: మలయాళీ అయినా.. తెలుగింటి కోడలుగా ఇక్కడ రచ్చ చేస్తోంది. ఈమె తన తోటి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరు 1999లో వీరిద్దరు పెళ్లైంది. ఇక రాజీవ్ కనకాల విషయానికొస్తే.. ఈయన ప్రఖ్యాత నటుడు, రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన దేవదాస్ కనకాల కుమారుడు. వీళ్ల అమ్మ కూడా లక్ష్మీ కనకాల కూడా రంగస్థల నటి.
ఈయన కూడా మొదట రంగస్థల నటుడిగా ఉంటూనే ‘వెల్కమ్ బ్యాక్’ సినిమాతో వెండితెరకు పరిచమయ్యారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాంబంటు’ సినిమా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఈ రోజు రాజీవ్ కనకాల పుట్టినరోజు., ఈయన 13 నవంబర్ 1968లో హైదరాబాద్‌లో జన్మించారు. ఈ రోజు ఇతను 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల తన భార్య సుమతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజును జరుపుకున్నాడు. అంతేకాదు టైటానిక్ తరహాలో వీళ్లిద్దరు ఓ పడవలో ఫోజులివ్వడం కూడా వైరల్ అవుతోంది.
View this post on Instagram
రాజీవ్ కనకాల విషయానికొస్తే.. ఈయన రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. అంతకు ముందు ఇతను రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాంతి నివాసం’ సీరియల్లో తనదైన విలనిజాన్ని పండించారు. ఒకవైపు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే హీరోగా కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ మధ్య రాజీవ్ కనకాల, తన భార్య సుమతో విడిపోతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై సుమ, రాజీవ్ కనకాల ఇద్దరు మా కాపురంలో నిప్పులు పోయకండని రిక్వెస్ట్ చేసారు.
సుమ సంపాదన విషయంలో రాజీవ్ కనకాలకు పడటం లేదని.. ఆయన ఓర్చుకోలేకపోతున్నారని కొన్ని పుకార్లు అయితే వచ్చాయి. కానీ తనకు అలాంటివి సంబంధమే లేదని.. భార్య సంపాదన నుంచి రూపాయి కూడా అడగలేదని.. ఎంత సంపాదిస్తున్నావని ఏ రోజు తాను ప్రశ్నించలేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజీవ్. కానీ ఇప్పుడు ఈ కారణమే వీళ్లను విడిపోయేలా చేస్తుందని ప్రచారం జోరుగానే చేసారు. మరీ ముఖ్యంగా మూడేళ్ల కింద సుమ అత్తగారు లక్ష్మి.. ఆ తర్వాత మామయ్య దేవదాస్ కనకాల.. మొన్నటికి మొన్న ఆమె ఆడపడుచు శ్రీలక్ష్మి చనిపోయారు. ఇలాంటి సమయంలో వాళ్ల విడాకులు అనే వార్తలను బాగా డిస్టర్బ్ చేసాయని ఇద్దరు చెప్పారు.
అంతేకాదు ఆ తర్వాత తను క్యాష్ ప్రోగ్రామ్‌లో భర్తను పట్టుకుని ఏడ్చేసింది సుమ. ఈ ఒక్క కార్యక్రమంతో తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు రాజీవ్ కనకాల కూడా ఇదే చెప్తున్నాడు. తమ మధ్య గొడవలు వచ్చాయనే నిజాన్ని అయితే ఒప్పుకున్నాడు. అయితే భార్యాభర్తలు అన్న తర్వాత కచ్చితంగా గొడవలు కామన్ అని.. అంత మాత్రానికే విడిపోతున్నారు.. విడిపోయారు అంటూ ప్రచారం చేయడం మాత్రం దారుణం అంటూ ఇద్దరు వాపోయారు. గొడవ పడ్డాం.. మళ్లీ కలిసిపోయాం అంతేకానీ విడిపోలేదని చెప్పుకొచ్చాడు ఈయన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajiv Kanakala, Suma Kanakala, Tollywood