Suma-Vatalakka:వాటే కాంబినేషన్.. స్టార్ యాంకర్ సుమతో కార్తీక దీపం వంటలక్క ప్రేమి విశ్వనాథ్..

యాంకర్ సుమతో కార్తీక దీపం వంటలక్క (Instagram/Photo)

Suma Kanakala-Karhtika Deepam Vatalakka Fame Premi Viswanath | కార్తీక దీపం ఫేమ్ వంటలక్క ప్రేమి విశ్వనాథ్ గురించి తెలుగు టీవీ ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా వంటలక్క ఫేమ్ ప్రేమి విశ్వనాథ్.. తెలుగు టాప్ యాంకర్ సుమను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Share this:
    Suma Kanakala-Karhtika Deepam Vatalakka Fame Premi Viswanath | కార్తీక దీపం ఫేమ్ వంటలక్క ప్రేమి విశ్వనాథ్ గురించి తెలుగు టీవీ ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు వారి లోగిళ్లలో దాదాపు ప్రతి ఇంట్లో అందరికీ వంటలక్కగా ఎంతో దగ్గరైంది. తెలుగింటి ఆడపడుచు కాకపోయినా తెలుగు ప్రేక్షకులతో ఎంతో మమేకమైంది. ప్రేమి విశ్వనాథ్‌ స్వస్థలం కేరళ. తాజాగా ఈమె తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న సుమ కనకాలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సుమ కూడా జన్మత: మలయాళీ కావడం విశేషం. వీళ్లిద్దరు ఇపుడు తెలుగు టీవీ ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో గత రెండేళ్లుగా ప్రసారమవుతున్న కార్తీక దీపం వంటలక్క గురించి  తెలుగు టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె కార్తీక దీపం రేటింగ్‌ ముందు మిగతా సీరియల్స్ అన్ని దిగదుడుపే. గత రెండేళ్లుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్‌లో కొనసాగుతూనే ఉంది. బిగ్‌బాస్, ఐపీఎల్ మొదలైనా..  కార్తీక దీపం రేటింగ్‌ను మాత్రం దాటకపోవడం విశేషం. ‘కార్తీక దీపం’ దూకుడు ఆపే సీరియల్ ఎపుడు వస్తుందో కానీ.. ఇప్పటికైతే.. కార్తీక దీపం సీరియల్ తెలుగులో నెంబర్ వన్ పొజిషన్‌లోనే కొనసాగుతూనే ఉంది.








    View this post on Instagram





    What are these two doing ???? Keep guessing .....


    A post shared by Suma P (@kanakalasuma) on






    వంటలక్క ఫేమ్  సుమ కనకాలను కలవడం ఇద్దరు కలిసి ఫోటో దిగడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను సుమ కనకాల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఐతే.. వంటలక్క ..సుమ హోస్ట్ చేసే ఏదైనా ప్రోగ్రామ్‌కు గెస్ట్‌గా వెళుతుందా అనేది చూడాలి. సుమ.. ఇప్పటికే క్యాష్‌తో పాటు పలు రియాలిటీ షోస్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఈమె హోస్ట్ చేసే ప్రోగ్రామ్స్‌‌కు టీవీల్లో మంచి రేటింగే ఉంది. అంతేకాదు సుమ మాటకారితనానికి ఫిదా అయిన చాలా మంది ఆమె గురించి కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఏమైనా.. యాంకర్‌గా ఫేమసైనా మలయాళీ భామ సుమను.. టీవీ సీరియల్‌తో ఫేమసైనా.. మరో మలయాళీ నటి కార్తీక దీపం వంటలక్క కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: