Suma Kanakala: తల్లి లేని మేనకోడలిని సొంత కూతురిలా చూసుకుంటున్న సుమ కనకాల..

యాంకర్ సుమ కనకాల (suma kanakala)

Suma Kanakala: బుల్లితెరపైనే కాదు బయట కూడా సుమ కనకాలకు చాలా మంది ఇమేజ్ ఉంది. అద్భుతమైన పేరు కూడా ఉంది. అంతకుమించి మంచిది అనే బిరుదు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఇదే మరోసారి నిరూపించింది సుమ కనకాల.

  • Share this:
బుల్లితెరపైనే కాదు బయట కూడా సుమ కనకాలకు చాలా మంది ఇమేజ్ ఉంది. అద్భుతమైన పేరు కూడా ఉంది. అంతకుమించి మంచిది అనే బిరుదు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఇదే మరోసారి నిరూపించింది సుమ కనకాల. రాజీవ్ కనకాల ఇంట్లో గత మూడేళ్లుగా వరస విషాదాలు జరిగాయి. మూడేళ్ల కింద అమ్మ.. రెండేళ్ల కింద ఆయన నాన్న.. ఈ ఏడాది ఆయన చెల్లి శ్రీలక్ష్మి కనకాల మరణించారు. దాంతో ఆ కుటుంబం కొన్నాళ్ల పాటు కోలుకోలేకపోయింది. 2018లో రాజీవ్ తల్లి.. గతేడాది ఆయన తండ్రి దేవదాస్ కనకాల.. 2020లో ఆయన చెల్లి శ్రీలక్ష్మి కన్నుమూసారు.

శ్రీలక్ష్మి కనకాల కుటుంబం (Sri Lakshmi kanakala family)
శ్రీలక్ష్మి కనకాల కుటుంబం (Sri Lakshmi kanakala family)


రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడిన శ్రీలక్ష్మి.. ఆరోగ్యం విషమించడంతో ఈ ఏడాది ఎప్రిల్ 6న కన్నుమూసింది. సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు ఆమె భర్త. అప్పట్లోనే ఆయన్ని ప్రేమ వివాహం చేసుకుంది ఈమె. పెద్దలు కూడా అంగీకరించారు. ఇదిలా ఉంటే ఆడపడుచు మరణం తర్వాత సుమ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈమె నిర్ణయాన్ని చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తారు కూడా. శ్రీలక్ష్మికి ఇద్దరు సంతానం. ఇద్దరూ అమ్మాయిలే.. అందులో పెదపాప ఇంటర్మీడియట్ చదువుతుంటే.. చినపాప పదో తరగతిలో ఉంది.

యాంకర్ సుమ కనకాల (suma kanakala)
యాంకర్ సుమ కనకాల (suma kanakala)


ఇంత చిన్న వయసులోనే తల్లి మరణించడంతో ఎదుగుతున్న పిల్లలకు ఏం చేయాలో తోచడం లేదు. ఈ సమయంలో ఆ పిల్లలకు తల్లి అవసరం కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు మేనత్తగా ఉన్న ఈమె.. తల్లి లేని ఆ పిల్లలకు తల్లిగా మారిపోయింది. అయితే కేవలం మాటల వరకు చెప్పి ఊరుకోకుండా ఆ పిల్లల బాధ్యత తీసుకుంటుంది సుమ. తాజాగా తన మేనకోడలు రాగలీనతో సుమ ఆడుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో ఆ పాపకు తినిపిస్తూ హాయిగా నవ్విస్తుంది సుమ కనకాల. ఈమె చేసిన పని చూసి అంతా నువ్వు దేవత తల్లి అంటూ పొగిడేస్తున్నారు.

తల్లి లేని ఆ పిల్లల బాధ్యత తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. తన పిల్లలతో పాటు ఇప్పుడు ఆడపడుచు పిల్లలను కూడా సొంత బాధ్యతగా తీసుకుంటుంది సుమ. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు కూడా సుమకు సలాం చేస్తున్నారు. నీ లాంటి మంచి మనసు ఉన్న వాళ్లు చాలా అరుదుగా ఉంటారు తల్లి అంటూ ఆమెను పొగిడేస్తున్నారు. మరి అంతేకదా.. డబ్బుంటే సరిపోదు.. మంచి గుణం కూడా ఉండాలి. అది సుమ దగ్గర చాలా ఉందని ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి అర్థమైపోయుంటుంది.
Published by:Praveen Kumar Vadla
First published: