Suma Kanakala - Rajiv : వివాదంలో సుమ, రాజీవ్ కనకాల దంపతులు.. ఓ లాండ్ విషయంలో తనను మోసం చేశారని సీనియర్ నటి అన్నపూర్ణ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్, సుమ దంపతులపై కన్నీటి పర్యంతమయ్యారు. రాజీవ్ కనకాల తండ్రి దివంగత దేవదాస్ కనకాల చేతిలో ఓ స్థలం విషయంలో తాను మోసపోయినట్టు అన్నపూర్ణమ్మ చెప్పారు. దేవదాసు మరణం తర్వాత ఈ స్థలం విషయంలో ఉన్న వివాదాన్ని పరిష్కరించవల్సిందిగా రాజీవ్‌తో పాటు ఆమె భార్య సుమను కోరాను. అయినా ఈ విషయమై ఎలాంటి ఫలితం రాలేదన్నారు. 22 యేళ్ల క్రితం సుమ మామగారైన దేవదాసు కనకాల నుంచి ఓ భూమిని కొన్నాను. ఆ తర్వాత అదే భూమి దేవదాసు కనకాల వేరే వాళ్లకు అమ్మారు. ఈ విషయమై దేవదాసుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలుసన్నారు. ఆయన మరణం తర్వాత ఈ భూమి వివాదాన్ని రాజీవ్‌తో పాటు సుమ పరిష్కరిస్తారని తాను అనుకున్నాను. కానీ వాళ్లు ఈ విషయమే పట్టనట్టు వ్యవహరించారు.
ఈ విషయమై ఓ సారి రాజీవ్ కనకాలతో ఫోన్లో మాట్లాడితే.. ఈ సమస్యను పరిష్కరిస్తానని హామి ఇచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత ఎపుడు ఆయనకు ఫోన్ చేసినా.. బిజీ బిజీగా వచ్చేది. దీంతో అనుమానం వచ్చి తనకు తెలిసిన మధ్యవర్తితో వాళ్లతో ఫోన్ చేయించాను. అపుడు తెలిసింది రాజీవ్ కనకాల తన ఫోన్ బ్లాక్ చేసిన విషయం. అంతేకాదు మధ్యవర్తి .. రాజీవ్‌తో మాట్లాడితే.. ఈ విషయమై ఎలాంటి సంబంధం లేదన్నారు. దేవదాసు కనకాల చేతిలో తాను మోసపోయిన విషయం కుటుంబ సభ్యులందరికీ తెలుసు అన్నారు. అప్పట్లో ఈ స్థలం విషయమై దేవదాసు కనకాలతో తనకు పెద్ద గొడవే జరిగిందన్నారు. ఆ సమయంలో రాజీవ్, సుమతో అందరు ఉన్నారు.
దేవదాసు మరణం తర్వాత ఈ స్థలం విషయమై అందరు ప్లేటు ఫిరాయించారని చెప్పారు. ఆ తర్వాత అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. ఆ భూమి పోతే పోనివ్వండి. భూమి పట్టుకొని నేను పోతానా... సుమ, రాజీవ్‌లు ఇద్దరు ఈ భూమిపైనే ఉండిపోతారా అంటూ ఒకింత వైరాగ్యాంతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో వివాద రహితులుగా ఉన్న వీళ్లిద్దరు అన్నపూర్ణమ్మ లాండ్ ఇష్యూతో ఒకింత అభాసుపాలైయ్యారు. మరి ఈ విషయాన్ని సుమ, రాజీవ్ దంపతులు ఎలా స్పందిస్తారనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.