Suma Kanakala: హీరోగా ఎంట్రీ ఇస్తున్న సుమ-రాజీవ్ కనకాల తనయుడు..

సుమ, రాజీవ్ కనకాల తనయుడు హీరోగా పరిచయం (Youtube/Credit)

Suma Rajeev Kanakala | ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీల్లో వారసులదే హవా. ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోల నట వారసులు హీరోలుగా,  ఎంట్రీ ఇచ్చి తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  తాజాగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా పరిచయం కాబోతున్నాడు. దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

  • Share this:
    Suma Rajeev Kanakala | ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీల్లో వారసులదే హవా. ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోల నట వారసులు హీరోలుగా,  ఎంట్రీ ఇచ్చి తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  అటు హీరోయిన్స్, కమెడియన్స్‌తో పాటు దర్శకులు, నిర్మాతల వారసులు కూడా సినీ రంగ ప్రవేశం చేసారు. అందులో టాలెంట్ ఉన్న వాళ్లు హీరోలుగా నిలదొక్కుకున్నారు. మరికొందరు ఒకటి రెండు సినిమాల తర్వాత కనుమరుగైపోయారు.  ఆ సంగతి పక్కన పెడితే.. తెలుగు లోగిళ్లలో తన మాటల గలగలతో అందరికీ చేరువైన ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. గతంలో రోషన్ పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఇపుడు కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు.

    ఈ ఆదివారం రోషన్ తొలి చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని ఒక దేవాలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ మేరకు దానికి సంబంధించిన వీడియోను రాజీవ్ కనకాల సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ సినిమాను విజయ్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్‌ను తప్పక ఆదరించాలని కోరారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: