ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సుమ కనకాల కూడా తన పనులన్నీ అభిమానులతో పంచుకుంటుంది. ఆ మధ్య రామనవమి కానుకగా నోరూరించే పులిహోరను కూడా కలిపేసింది ఈమె. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ చూసి దాన్ని క్యాష్ చేసుకోడానికి సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ కూడా పెట్టి అందులోనూ తన లైఫ్ విశేషాలతో పాటు అన్నీ చెబుతుంది సుమ కనకాల. దాంతో పాటు సుమక్క అనే ప్రోగ్రామ్ కూడా మొదలుపెట్టింది ఈమె.
అంతేకాదు.. షూటింగ్స్ లేనపుడు తానేం చేస్తాననే విషయంపై కూడా క్లారిటీ ఇస్తుంది సుమ. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది ఈమె. తాజాగా మరోసారి వంటల కార్యక్రమం మొదలు పెట్టింది. ఈ సీజన్లో లేడీస్ అంతా కచ్చితంగా తమకు యిష్టమైన డిషెస్ చేసుకుంటూ ఉంటారని చెప్పుకొచ్చింది సుమ. వరలక్ష్మి వ్రతం సందర్భంగా గారెలు వండుతూ వీడియో పోస్ట్ చేసింది. బయట జోరుగా వర్షం పడుతుంటే లోపల ఈమె గారెలు వండుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.