హోమ్ /వార్తలు /సినిమా /

జయమ్మ పంచాయతీకి ఎందుకు వెళ్ళింది? అసలు ఈ ఈడులు గొడవ ఏంటి ?

జయమ్మ పంచాయతీకి ఎందుకు వెళ్ళింది? అసలు ఈ ఈడులు గొడవ ఏంటి ?

తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా ఆరేళ్ళ బుడ్డోడు నుంచి 60 ఏళ్ళ తాత వరకు అంతా చెప్పేది ఒక్కటే మాట.. సుమ కనకాల. బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా ఏలేస్తుంది సుమ. మరీ ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు ఈమె చాలా చేరువైపోయింది. సుమ హోస్టింగ్ చేస్తుందటే చాలు.. వెంటనే టీవీల ముందు అతుక్కుపోయే లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఈమెకు.

తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా ఆరేళ్ళ బుడ్డోడు నుంచి 60 ఏళ్ళ తాత వరకు అంతా చెప్పేది ఒక్కటే మాట.. సుమ కనకాల. బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా ఏలేస్తుంది సుమ. మరీ ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు ఈమె చాలా చేరువైపోయింది. సుమ హోస్టింగ్ చేస్తుందటే చాలు.. వెంటనే టీవీల ముందు అతుక్కుపోయే లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఈమెకు.

జయమ్మ పంచాయతీ సినిమా మే 6న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది టీమ్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను టీం విడుదల చేసింది.

ప్రముఖ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) ప్రధాన పాత్రలో నటిస్తోన్న జయమ్మ పంచాయతీ( Jayamma Panchayathi)సినిమా ట్రైలర్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఇవాళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ విడుదలైన కాసేపటికే వేలల్లో లైకులు వచ్చాయి. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో జయమ్మ ఇంటి సమస్య కాస్త ఊరి సమస్యగా మారినట్లు తెలుస్తోంది. దీంతో అసలు జయమ్మ ఇంటి గొడవ ఏంటి అనేది ఇప్పుడు సస్పెన్స్ పుట్టిస్తోంది. ట్రైలర్‌లో జయమ్మ కూతురు గుడిలో పనిచేసే అబ్బాయితో ప్రేమలో పడుతోంది. దీంతో ఈ విషయం కాస్త పంచాయతీకి వెళ్తున్నట్లు అర్థం అవుతోంది.

సుమతో ఈ సినిమాలో బూతులు కూడా తిట్టించారు. శ్రీకాకుళం యాసలో కొన్ని డైలాగ్స్ మనకు కనిపిస్తాయి. పక్క పల్లెటూరి డ్రామాలో ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.  జయమ్మ ఇంటి పంచాయతీ ఊరు పంచాయతీ ఎందుకు అయ్యింది. ఆ ఊరు వార్తాల్లోకి ఎందుకు ఎక్కింది? అసలు గొడవ ఏంటి అనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

' isDesktop="true" id="1270424" youtubeid="iycJ-_VCHm8" category="movies">

జయమ్మ పంచాయతీలో సుమను మినహాయిస్తే మిగతావాళ్లంతా దాదాపు కొత్తవాళ్లే. పూర్తిగా హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) వస్తుంది. విజయ్ కుమార్ కలివరపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 6న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది టీమ్. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు.అటు టీవీషోల్లో కూడా సుమ తన సినిమాను బాగానే ప్రమోట్ చేసుకుంటుంది.

సుమ (Anchor Suma)అంటే తెలియని తెలుగు టీవీ,సినీ ప్రేక్షకులుండరు. ఏ షో చూసిన సుమదే. ఈ హిట్ సినిమా ఈవెంట్ చూసిన సుమనే. ఎలాంటి షో అయిన.. అతిథులు ఎవరైనా సరే.. ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో ఇలానే అందర్నీ ఆకట్టుకుంటోంది. సుమ మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. అనర్గగళంగా తెలుగులో మాట్లాడుతూ.. అందర్నీ అట్రాక్ట్ చేస్తుంటుంది.సుమ పంచ్‌లకు తగ్గట్టు యాంకరింగ్ చేసే యాంకర్స్ ఎవరూ తెలుగులో ఇక లేరనే చెప్పాలి. ప్రారంభంలో తెలుగు సినిమాల్లో నటించిన సుమ ఆ తర్వాత కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చి టీవీ షోలతో బిజీగా అయిపోయింది. ఇప్పుడు మరోసారి జయమ్మ పంచాయతీ(Jayamma Panchayathi)తో వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తోంది సుమ కనకాల. మరి ఈ చిత్రం సుమకు ఎలాంటి సక్సెస్ తెచ్చి పెడుతుందో చూడాల్సిందే.

First published:

Tags: Anchor suma, Suma Kanakala, Tollywood

ఉత్తమ కథలు