Home /News /movies /

SUMA KANAKALA HAVE TOUGH FIGHT WITH RAJEEV KANAKALA TO HOST THE RECHI PODHAAM BROTHER SHOW ON ETV NR

Rajeev Kanakala - Anchor Suma: రెచ్చిపోదాం బ్రదర్ అంటున్న రాజీవ్ కనకాల.. ఏకంగా సుమకి పోటీగా?

suma rajeev kanakala

suma rajeev kanakala

Rajeev Kanakala - Anchor Suma: తెలుగు సినీ నటుడు రాజీవ్ కనకాల పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈయన ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.

    Rajeev Kanakala - Anchor Suma: తెలుగు సినీ నటుడు రాజీవ్ కనకాల పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈయన ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. విలన్, సహాయ పాత్రలలో నటించిన రాజీవ్ కనకాల ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. ఇక ఆయన భార్య సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే సుమ కి పోటీగా రెచ్చిపోవడానికి వస్తున్నాడు రాజీవ్.

    ఇప్పటికే సుమ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో పేరు సంపాదించుకుంది. బుల్లితెరలో తన యాంకరింగ్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే రాజీవ్ కనకాల కూడా బుల్లితెరలో మెప్పించడానికి వస్తున్నాడు. పలుమార్లు సుమ యాంకరింగ్ చేసిన షో లలో గెస్ట్ గా పాల్గొన్న రాజీవ్ కనకాల ఇప్పుడు తను కూడా ఓ షోలో హోస్ట్ గా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇటీవలే ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో రాజీవ్ కనకాల హోస్టింగ్ చేయనున్నట్లు కనిపించారు.

    ఈటీవీలో నిన్న ప్రసారమైన షో 'రెచ్చిపోదాం బ్రదర్'. ఇక అందులో రాజీవ్ కనకాల ఎంట్రీ తో రావడం పక్క అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత జై లవకుశ సినిమాలోని రావణ పాటతో మళ్ళీ ఎంట్రీ ఇవ్వగా ఏది ఏమైనా.. షో ఏదైనా నేను రెడీ అంటూ సవాల్ చేశాడు. ఇక ఈ షో జూన్ 7న ప్రారంభమైన ఈ షో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇక ఈ షోను ప్రముఖ నిర్మాణ సంస్థ మల్లెమాల నిర్మించగా మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. సినిమాకి పోటీగా వస్తున్నందుకు రాజీవ్ కనకాల హోస్టింగ్ విషయంలో సుమ ని మించి పోతాడో లేదు ఎదురు చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజీవ్ కనకాల ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటిస్తున్నాడు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Etv show, Rajeev Kanakala, Rechi podhaam brother, Suma Kanakala

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు