Home /News /movies /

SUMA KANAKALA EMOTIONAL POST ABOUT HER HUSBAND RAJEEV KANAKALA TA

Suma Kanakala: ఎప్పటికీ నువ్వే ఆనందం అంటూ భర్త రాజీవ్‌తో సుమ భావోద్వేగం..

సుమ కనకాల (Instagram/Photo)

సుమ కనకాల (Instagram/Photo)

Suma Kanakala | యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. జన్మత: మలయాళీ అయిన తెలుగింటి కోడలుగా తనదైన యాంకరింగ్‌తో మైమరిపిస్తోంది. తాజాగా ఈమె చేసిన ఓ పోస్ట్ నెటింట్లో వైరల్ అవుతోంది.

    Suma Kanakala | యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. జన్మత: మలయాళీ అయిన తెలుగింటి కోడలుగా తనదైన యాంకరింగ్‌తో మైమరిపిస్తోంది. ఎంత పెద్ద షో అయినా.. ఆడియో ఫంక్షన్ అయినా సుమ ఉంటే ఆ కిక్కే వేరు. అంతలా తన మాటలతో ప్రేక్షకులను మైమరిపిస్తోంది. సుమ కనకాల ముందు వెనకలా ఎంత మంది యాంకర్స్ వచ్చినా.. ఇప్పటి తెలుగులో యాంకర్‌గా ఆమె స్థానం పదిలంగా ఉంది. ఈ మధ్యకాలంలో సుమ తన భర్త రాజీవ కనకాలతో విడాకులు తీసుకోబోతుందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టినుండే. చాల ా మంది ఆ విషయం నిజమే అనుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీళ్ల కాపురంలో అంతలా విడిపోయే పరిస్థితులు ఏమి వచ్చాయా అని అందరు చర్చించుకున్నారు. అయితే వీళ్లిద్దరి మధ్య అలాంటిదేమి లేదని తాజాగా ఓ కార్యక్రమంతో అంతా క్లిష్టల్ క్లియర్ అయింది.








    View this post on Instagram





    My dearest raja , my ❤️ , oneness and happiness forever @rajakanakala


    A post shared by Suma P (@kanakalasuma) on





    ఇంకా చెప్పాలంటే.. భార్య భర్తలన్న తర్వాత ఏదో చిన్నపాటి గొడవలు కామన్. కానీ సోషల్ మీడియా దాన్ని భూతద్ధంలో పెట్టి పెద్దగా చూపించే ప్రయత్నం చేసింది. అవన్నీ పుకార్లు అని తాజాగా సుమ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో అవన్నీ రూమర్స్ అనే విషయం స్పష్టమైంది. ఈ పోస్ట్‌లో సుమ కనకాల ఈ విధంగా రాసుకొచ్చింది.. నా ప్రియమైన రాజా ఎప్పటికీ నా సంతోషం నువ్వు అంటూ మెసెజ్‌తో పాటు భర్తతో ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. మొత్తంగా సుమ తాజాగా చేసిన పోస్ట్‌తో వీళ్లిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవనే విషయం స్పష్టమైంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anchor suma, Rajeev Kanakala, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు