హోమ్ /వార్తలు /సినిమా /

Suma Cash Show - Pandu: సుమ ‘క్యాష్’ షోలో చెప్పుతో కొట్టుకున్న ఢీ డాన్సర్ పండు..

Suma Cash Show - Pandu: సుమ ‘క్యాష్’ షోలో చెప్పుతో కొట్టుకున్న ఢీ డాన్సర్ పండు..

క్యాష్ షోలో పండు (Cash Show Pandu)

క్యాష్ షోలో పండు (Cash Show Pandu)

Suma Cash Show - Pandu: తెలుగు బుల్లితెరపై మంచి రేటింగ్ వచ్చే షోలలో క్యాష్ (Suma Cash Show) కూడా ఒకటి. సుమ కనకాల యాంకరింగ్‌తో ఈ షో రేంజ్ ఎప్పుడూ పైనే ఉంటుంది. అంతేకాదు.. ఇందులో గేమ్‌తో పాటు అదిరిపోయే కామెడీ కూడా ఉంటుంది.

తెలుగు బుల్లితెరపై మంచి రేటింగ్ వచ్చే షోలలో క్యాష్ కూడా ఒకటి. సుమ కనకాల యాంకరింగ్‌తో ఈ షో రేంజ్ ఎప్పుడూ పైనే ఉంటుంది. అంతేకాదు.. ఇందులో గేమ్‌తో పాటు అదిరిపోయే కామెడీ కూడా ఉంటుంది. సుమ హోస్టింగ్ ఈ షోకు ప్రధాన హైలైట్. ఎలాంటి కంటెస్టెంట్స్ వచ్చినా కూడా దాన్ని వినోదాత్మకంగా మార్చడంలో సుమ ఆరితేరిపోయింది. అయితే అప్పుడప్పుడూ ప్రోమోలలో కాస్త ఎమోషనల్ విషయాలను కూడా ఎక్కువగానే చూపిస్తుంటారు. మరికొన్నిసార్లు వినోదం కోసం చేసిన పిచ్చి పనులు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా క్యాష్ షోలో జరిగిన ఓ చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఢీ షోలో వచ్చే డాన్సర్స్ బుల్లితెరపై బాగా ఫేమస్. అందులో పండు అయితే మరీనూ. నాది నక్కిలీసు గొలుసు అంటూ పిచ్చెక్కించాడు ఈయన. పండు పాటలకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.

ప్రమోషనల్ సాంగ్స్ కూడా చేస్తూ బాగానే బిజీ అయిపోయాడు పండు. ఇప్పుడు ఈయన క్యాష్ షోకు తన చెల్లితో కలిసి వచ్చాడు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వచ్చే వారం ప్రోమో విడుదల చేసారు. అందులో అంతా తమ సోదరీమణులతో కలిసి వచ్చారు. సింగర్ సాకేత్ తన చెల్లితో కలిసి వచ్చాడు. అలాగే పండు తన సోదరితో వచ్చాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ జాఫర్ తన అక్కతో కలిసి క్యాష్ షోకు వచ్చాడు. బిగ్ బాస్ భాను కూడా తన తమ్ముడితో కలిసి షోకు వచ్చింది.

' isDesktop="true" id="998450" youtubeid="Apd5P3wp8IY" category="movies">

ఇదిలా ఉంటే ఈ షోలో సాకేత్ చెల్లితో ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నించాడు పండు. దాంతో అక్క్డడే ఉన్న సుమ ఆమెతో పండుకు రాఖీ కట్టించింది. అన్నయ్య అన్నయ్య అని పిలిపించింది. దాంతో తన చెప్పు తీసుకుని తానే కొట్టుకున్నాడు పండు. అది చూసి అక్కడున్న వాళ్లంతా పగలబడి నవ్వేసారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

First published:

Tags: Anchor suma, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు