సుమ క్యాష్ షోలో పచ్చిబూతులు.. చెవులు మూసుకున్న స్టార్ యాంకర్..

సుమ క్యాష్ లేెటెస్ట్ ప్రోమో

తెలుగు ఇండస్ట్రీలో కాస్త మంచి ఇమేజ్ ఉన్న యాంకర్ సుమ కనకాల. ఈమె ఏ షో చేసినా కూడా దాదాపు విజయం సాధించడం ఖాయం. రేటింగ్స్ విషయంలో కూడా సుమ అద్భుతాలు చేస్తుంటాయి.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో కాస్త మంచి ఇమేజ్ ఉన్న యాంకర్ సుమ కనకాల. ఈమె ఏ షో చేసినా కూడా దాదాపు విజయం సాధించడం ఖాయం. రేటింగ్స్ విషయంలో కూడా సుమ అద్భుతాలు చేస్తుంటాయి. ఆమె షో అయితే ఇంటిల్లిపాది కూర్చుని చూడొచ్చనే ఇమేజ్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈమె కూడా రానురాను అందరిలాగే మారిపోతుంది. ఆమె పద్దతిగా ఉంటే సరిపోదు.. షోలో కూడా పద్దతులు పాటించాలి కదా అంటున్నారు అభిమానులు. ఇప్పుడు ఇలాంటి విషయమే జరిగింది. తాజాగా సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ షోకి ఫలక్‌నుమా దాస్ హీరో వచ్చాడు. వచ్చే వారం ప్రోమో ఇప్పుడే విడుదల చేసారు నిర్వాహకులు.
Suma Kanakala Cash new promo released and Vishwak Sen vulgar dialogues going viral pk తెలుగు ఇండస్ట్రీలో కాస్త మంచి ఇమేజ్ ఉన్న యాంకర్ సుమ కనకాల. ఈమె ఏ షో చేసినా కూడా దాదాపు విజయం సాధించడం ఖాయం. రేటింగ్స్ విషయంలో కూడా సుమ అద్భుతాలు చేస్తుంటాయి. suma kanakala,suma kanakala twitter,suma kanakala cash program,suma kanakala cash promo,suma kanakala cash latest promo,suma kanakala vishwak sen cash promo,suma kanakala vishwak sen mahesh cash promo,cash latest promo,cash latest episode,suma kanakala shock,suma kanakala remuneration,vishwak sen vulgar dialogues,telugu cinema,సుమ,సుమ కనకాల,సుమ కనకాల క్యాష్ ప్రోమో,క్యాష్ ప్రోమో లేటెస్ట్,విశ్వక్ సేన్ సుమ కనకాల,విశ్వక్ సేన్ క్యాష్ ప్రోమో,తెలుగు సినిమా,ఫలక్‌నుమా దాస్ విశ్వక్ సేన్ డైలాగ్
క్యాష్ లేటెస్ట్ ప్రోమో

ఇది చూసిన తర్వాత అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఎపిసోడ్‌లో ఫలక్‌నుమా దాస్ హీరో విశ్వక్ సేన్‌తో పాటు కమెడియన్ రంగస్థలం మహేష్.. మీకు మాత్రమే చెప్తా ఫేమ్ అభినవ్ గోమఠం.. యంగ్ హీరోయిన్ సిమ్రన్‌ గెస్ట్‌లుగా వచ్చారు. ఎప్పట్లాగే సుమ కనకాల అందరితోనూ ఆడేసుకుంటుంది.. సెటైర్లు వేస్తుంది. అందరికంటే ఎక్కువగా జబర్దస్త్ మహేష్‌పైనే పడ్డాయి కూడా. అయితే అంతా బాగానే ఉంది కానీ చివర్లో మాత్రం విశ్వక్ సేన్‌ రచ్చ చేసాడు. ఇక ప్రోమో చివర్లో మన హీరోగారు తనకు బాగా కలిసొచ్చిన డైలాగ్ చెప్పేసాడు. తాను చెప్పడమే కాకుండా అక్కడున్న స్టూడెంట్స్‌తో కూడా చెప్పించేసాడు.

ఫలక్‌నుమా దాస్‌ చిత్రంలోని బాగా ఫేమస్ అయిన బూతు డైలాగ్ క్యాష్ షోలో సుమ కనకాల కళ్లముందే పేలింది. ఫలక్‌నుమాలా గ్యారా బజే లేసినమా.. దో బజే కలిసినమా.. అడ్డం ఎవడన్నా వస్తే..... అంటూ పచ్చి బూతు డైలాగును పిల్లలతో చెప్పించాడు విశ్వక్ సేన్. దాంతో సుమ ఒక్కసారిగా షాక్ అయిపోయి.. చెవులు మూసుకుంది. ఆ డైలాగ్ విన్న తర్వాత అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా పరేషాన్ అయ్యారు. ఏదేమైనా కూడా సుమ లాంటి యాంకర్ ఇలాంటి బూతులను ఎంకరేజ్ చేయడం ఏ మాత్రం బాగోలేదంటున్నారు అభిమానులు. మరి దీనిపై సుమ కనకాల ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: