సింగర్ సునీతకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన యాంకర్ సుమ...ధర ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్

సుమ, సునీత

అత్యంత సన్నిహితులు అయిన కొందరు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరు అయ్యారు. యాంకర్ ఝన్సీ, సుమ ముందుగానే సందడి చేశారు. రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తన అభినందనలు తెలియజేశారు.

  • Share this:
    టాలివుడ్ చిత్ర సీమలో రెండు దశాబ్దాలుగా తన గాత్రంతో అలరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న గాయనీ మణుల్లో సింగర్ సునీత ఒకరు. కేవలం 15 సంవత్సరాల వయస్సులో ప్లేబ్యాక్ సింగర్ గా మైక్ అందుకున్న సునీత, ఆ తర్వాత కాలంలో కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగారు. అయితే తక్కువ సమయంలో మంచి గుర్తింపుతో పాటు ఎన్నో సినీ అవార్డులను కూడా అందుకున్నారు. అదే సమయంలో చాలా మంది నటీమణులకు డబ్బింగ్ కూడా చెప్పారు. ఇప్పుడు చాలామంది హీరోయిన్లకు తన గాత్రం కూడా అందిస్తున్నారు. కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయినప్పటికీ, వైవాహిక జీవితంలో మాత్రం ఆమె ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. మొదటి భర్త నుంచి మనస్పర్థలు తలెత్తి విడాకులు తీసుకుంది. తాజాగా డిజిటల్ మీడియా అధినేత రామ్ ను ఆమె వివాహం చేసుకుంది. ఇప్పుడు సింగర్ సునీత వివాహం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. 19 ఏళ్ల వయస్సులో కిరణ్ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీతకు ఇద్దరు సంతానం. విడాకులు తీసుకున్న సునీత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని సినిమాల్లో పాటలు పాడుతూ, పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పేవారు. తన స్వశక్తితో ఇద్దరు పిల్లలను పోషించారు. అయితే మీడియాలో సునీత రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తుండేవి. కానీ ఆమె వాటిని కొట్టి పారేశారు. ఈ సమయంలోనే ఆమె రామ్ వీరపనేనితో సునీత వివాహం సెట్ అయ్యింది. కొద్ది రోజుల క్రితం వీరి నిశ్చితార్థం కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. నిశ్చితార్థం తర్వాత ఓ ముహూర్తం అనుకున్నాక, జాతకం ప్రకారం కాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత దీన్ని జనవరి 9న ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి సునీత పెళ్లి పనులతో బిజీ అయిపోయారు. ఇటీవల ఓ హోటల్ లో వీళ్ల ప్రీవెడ్డింగ్ పార్టీ కూడా జరిగింది. అనుకున్న ప్రకారం జనవరి 9న మీడియా దిగ్గజం రామ్ వీరపనేనితో సింగర్ సునీత వివాహం జరిగింది. ఈ వివాహం శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగింది. ఈ వేడుకకు చాలా తక్కువ మంది మాత్రమే హాజరు అయ్యారు. ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారు. సునీత సినీ ఇండస్ట్రీలో చాలా మందితో క్లోజ్ గా ఉంటారు. అయినప్పటికీ కరోనా కారణంగా చాలా తక్కువ మంది వివాహానికి హాజరు అయ్యారు.

    కానీ అత్యంత సన్నిహితులు అయిన కొందరు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరు అయ్యారు. యాంకర్ ఝన్సీ, సుమ ముందుగానే సందడి చేశారు. రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తన అభినందనలు తెలియజేశారు. 43 ఏళ్ల సునీతకు ఇప్పటికే కుమార్తె, కొడుకు ఉన్నారు. అయితే ఈ వివాహం సందర్భంగా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన సునీతకు సుమ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం. సునీత, సుమ మధ్య సుమారు 25 సంవత్సరాలకు పైగా స్నేహం ఉంది. వీరంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కావడం విశేషం. అయితే సుమ, రాజీవ్ కనకాల ఇద్దరూ ఈ వివాహానికి హాజరు కాగా, సుమ తన స్నేహితురాలు సునీతకు ఖరీదైన వజ్రాల నెక్లెస్ బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం.
    Published by:Krishna Adithya
    First published: