SUMA CASH LATEST PROMO GOES VIRAL AND RAJEEV KANAKALA EXCELLED IN EPISODE PK
Suma Kanakala: రాజీవ్ కనకాలను పట్టుకుని ఏడ్చేసిన సుమ.. డౌట్స్ ఫసక్..
సుమ,రాజీవ్ కనకాల (Suma Kanakala Rajeev)
Cash Latest Promo: కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త అయితే బాగానే వినిపిస్తుంది. స్టార్ యాంకర్ సుమ కనకాల తన భర్త రాజీవ్‌తో విడిపోయిందని.. ఈ వార్తలు చాలా రోజులుగా..
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త అయితే బాగానే వినిపిస్తుంది. స్టార్ యాంకర్ సుమ కనకాల తన భర్త రాజీవ్‌తో విడిపోయిందని.. ఈ వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. కానీ దీనిపై సుమ కానీ.. రాజీవ్ కనకాల గానీ ఎప్పుడూ స్పందించింది లేదు. దాంతో చాలా మంది నిజమే అనుకున్నారు కూడా. పైగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడు పోస్టులు పెట్టినా కూడా సుమ మాత్రమే కనిపిస్తుంది. ఇంట్లో ఆమె తప్ప మరెవరూ కనిపించడం లేదు. పిల్లలు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
సుమ,రాజీవ్ కనకాల (Suma Kanakala Rajeev)
ఇక సుమ, రాజీవ్ వేర్వేరుగా ఉంటున్నారని ప్రచారం అయితే బాగానే జరుగుతుంది. ఈ క్రమంలో ఒక్క ప్రోమోతో అనుమానాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేసారు ఈ జంట. తాజాగా క్యాష్ ప్రోగ్రామ్‌కు రాజీవ్ కనకాల వచ్చాడు. అందులో సుమతో ఈయన కెమిస్ట్రీ, రొమాన్స్ చూసిన తర్వాత ఇద్దరూ విడిపోయారు అంటూ నమ్మడం కూడా సాధ్యం కాదేమో..? అంతగా ఒకరికొకరు అన్నట్లు ఉన్నారు.
యాంకర్ సుమ రాజీవ్ దంపతులు (suma rajeev)
ఇంకా చెప్పాలంటే గతంతో పోలిస్తే ఇప్పుడే వీళ్ల మధ్య అన్యోన్యత ఉందేమో అన్నట్లుగా సుమ, రాజీవ్ ఉన్నారు. ఇద్దరూ కలిసి డాన్సులు చేసారు.. పాటలు పాడుకున్నారు.. ఎమోషనల్ అయ్యారు.. కామెడీ చేసారు.. ఒక్కటేంటి ఈ ప్రోమో చూసిన తర్వాత కచ్చితంగా టిఆర్పీ కూడా పగిలిపోవడం ఖాయం అనిపిస్తుంది. అంతగా ఇద్దరూ చంపేసారంతే.
పైగా ఈ ఎపిసోడ్‌కు రాజీవ్, సుమకు అత్యంత సన్నిహితులు అయిన సమీర్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర వచ్చారు. వాళ్లు కూడా కామెడీ అద్భుతంగా పండించారు. ఇక ప్రోమో చివర్లో రాజీవ్‌ను పట్టుకుని సుమ ఏడవడం.. భర్త ఓదార్చడం హైలైట్. మొత్తానికి ఈ ప్రోమో చూసిన తర్వాత సుమ, రాజీవ్ మధ్య ఏం పొరపచ్చాలు లేవనే విషయం అర్థమైపోయింది. ఒక్క ప్రోమోతో అన్ని అనుమానాలు ఫసక్ అయిపోయాయంతే.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.