సులోచన అనే పేరేదో పాత గానే ఉన్నా కూడా వింటుంటే మాత్రం క్లాస్ గా ఉంది. స్లమ్ గర్ల్ సులోచన సమయం ఆసన్నం (Sulochana Samayam Asannam) అనే టైటిల్ తో కొత్త సినిమా రాబోతోంది. ఈ టైటిల్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. సరోగసీ అనే కంటెంట్ వరల్డ్ మూవీస్ లో హిట్ పాయింట్. అలాంటి కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులకు కాస్తో కూస్తో టచ్ ఉన్న సబ్జెక్ట్ పై ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న సులోచన సమయం ఆసన్నం.. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకుంటూ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్. ఈ మధ్యకాలంలో వరల్డ్ వైడ్ గా ఇద్దరు డైరెక్టర్ లు వర్క్ చేయడం కూడా ట్రెండింగ్ గానే ఉంది. ఆ విషయంలో కూడా ఈ మూవీ టీమ్ ట్రెండీగానే వెళ్తోంది.
కథ, స్క్రీన్ ప్లే అందించిన లక్ష్మీ అనిల్ వెంకట కుమార్ పూరేటి, స్రవంతి మురళీ మోహన్ తో కలిసి సినిమాకు దర్శకత్వం వహించారు. ఇద్దరు డైరెక్టర్ లు అయినా కూడా ఎటువంటి క్రియేటివ్ డిఫరెన్స్ లు లేకుండా కథ కోరిన విధంగా తెరకెక్కించి.. భారీ బడ్జెట్ కాకున్నా కథ కోరిన బడ్జెట్ తో రూపొందించి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
నాలుగైదు సినిమాలు చేసిన అనుభవం ఉన్న బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించగా.. సహర్ క్రిష్ణన్, జయం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ దిలీప్ సల్వాడి, కన్నడ హీరో అర్జున్ ఆర్య ముఖ్య పాత్రల్లో నటించారు. సీనియర్ యాక్టర్ జయలలిత, కేరాఫ్ కంచరపాలెం మూవీ ఫేమ్ రాజు తో పాటు రాకేశ్, ప్రకాశ్ అడ్డా, రమేశ్ వీరవల్లి, తమిళ్ యాక్టర్ మహాన్, కామెడీ యాక్టర్ గోవింద్, మున్నాలు ఇతర పాత్రల్లో నటించారు.
S.S మూవీస్ అండ్ పా ఇన్ ఫినిటీ ఫిలిమ్స్ బ్యానర్ లో తీసిన సులోచన సమయం ఆసన్నం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సౌత్ ఫోటో ఎక్స్ పో ట్రేడ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. మూడు భాషల్లో రిలీజ్ చేయాలన్న ప్లాన్ తో మూడు భాషల్లోనూ పేరున్న ఆర్టిస్టులను తీసుకుని రూపొందించినట్లు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cinema, Tollywood, Tollywood actress