భారీ ఆఫర్‌‌‌ను తిరస్కరించిన సుకుమార్.. ఓటీటీ క్యాన్సల్..

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నసినిమా 'ఉప్పెన'.

news18-telugu
Updated: May 23, 2020, 7:31 AM IST
భారీ ఆఫర్‌‌‌ను తిరస్కరించిన సుకుమార్.. ఓటీటీ క్యాన్సల్..
సుకుమార్ Photo : Twitter
  • Share this:
ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. ఇప్పటికే తెలుగులో అమృతరామమ్ అనే సినిమా థియేటర్‌లో రిలీజ్ కాకుండా డెరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పరువాలేదనిపించింది. అందాలతార కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' అనే తమిళ చిత్రం కూడా ముందుగా డిజిటల్ మీడియా ద్వారా విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రాన్ని లాక్ డౌన్ కారణంగా థియేటర్లలో కాకుండా, అమెజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెల 19న విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో స్ట్రీమ్ కానుంది. అది అలా ఉంటే.. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నసినిమా 'ఉప్పెన' కూడా డిజిటల్‌లో విడుదలౌతుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ పై బుచ్చిబాబు దర్సకత్వం వహించాడు. ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. దాంతో ఈసినిమాను డిజిటల్ రిలీజ్ చెయ్యాలని ప్రయత్నాలు జరిగిన డీల్ కుదరకపోవడంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది.

Vaishnav tej uppena ott release, Keerthy Suresh penguin release, Keerthy Suresh penguin,Laxmi bomb ott release, anushka shetty news, nishabdam movie on ott, Akshay kumar Laxmi bomb, Akshay kumar, Laxmi bomb, Laxmi bomb release, disney hotstar, డిస్నీ హాట్ స్టార్‌, లక్ష్మీబాంబ్, అక్షయ్ కుమార్,nishabdham to release on ott platform, కీర్తి సురేష్ సినిమా,పెంగ్విన్,
ఓటీటీకి నో చెప్పిన సుకుమార్ Photo : Twitter


మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఉప్పెన చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 18 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఓటీటీ సంస్థలు చిత్రానికి రూ. 14 కోట్ల ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. హీరోయిన్‌గా కృతి శెట్టి నటించగా, విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించాడు.
Published by: Suresh Rachamalla
First published: May 23, 2020, 7:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading