Uppena - Sukumar: ఉప్పెనలో వచ్చిన లాభాలను సుకుమార్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడో తెలుసా?

Sukumar investing Uppena movie profits into another mega hero movie

Uppena - Sukumar: ఉప్పెన సినిమా హిట్ అయిన త‌ర్వాత వ‌చ్చిన లాభాల్లో సుకుమార్‌కు గ‌ట్టిగానే లాభం వ‌చ్చింద‌ని సినీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే సుకుమార్ ఉప్పెన సినిమాలో వ‌చ్చిన లాభాల‌ను మ‌రో సినిమాలో ఇన్వెస్ట్ చేస్తున్నాడ‌ట‌.

  • Share this:
    ఈ ఏడాది విడుద‌లైన చిత్రాల్లో ఉప్పెన సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఇప్ప‌టికే డెబ్పై కోట్ల రూపాయ‌ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ సినిమాను బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తే.. ఆయ‌న గురువు సుకుమార్ త‌న సొంత బ్యాన‌ర్ సుకుమార్ రైటింగ్స్‌తోపాటు మైత్రీ మూవీ మేక‌ర్స్‌ను క‌లుపుకుని సినిమాను నిర్మించాడు. సినిమా హిట్ అయిన త‌ర్వాత వ‌చ్చిన లాభాల్లో సుకుమార్‌కు గ‌ట్టిగానే లాభం వ‌చ్చింద‌ని సినీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

    అయితే సుకుమార్ ఉప్పెన సినిమాలో వ‌చ్చిన లాభాల‌ను మ‌రో సినిమాలో ఇన్వెస్ట్ చేస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ సుకుమార్ ఉప్పెన లాభాల‌ను ఎక్క‌డో ఇన్వెస్ట్ చేస్తున్నాడో తెలుసా? ఉప్పెన హీరో వైష్ణ‌వ్ తేజ్ అన్న‌య్య సాయితేజ్ సినిమా. సాయితేజ్ హీరోగా కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడే. అందుకోసం సుకుమార్ ఉప్పెన లాభాల‌ను సాయితేజ్‌, కార్తీక్ దండు సినిమాలో ఇన్వెస్ట్ చేస్తున్న‌ట్లు టాక్‌.

    సాయితేజ్, కార్తీక్ దండు కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను సుకుమార్‌తో పాటు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ కూడా నిర్మిస్తున్నాడు. మ‌రి కార్తీక్ దండు గురువు గారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుని హిట్ కొడ‌తాడో లేదో చూడాలి.
    Published by:Anil
    First published: