Sukumar: విజయ్ దేవరకొండతో సినిమా ఆగిపోలేదు.. దర్శకుడు సుకుమార్ క్లారిటీ..

సుకుమార్ (Twitter/Photo)

Sukumar: ‘పుష్ప’ తర్వాత సుకుమార్ నెక్ట్స్ మూవీ ఆ హీరోతోనే.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..వివరాల్లోకి వెళితే.

  • Share this:
    Sukumar: ‘పుష్ప’ తర్వాత సుకుమార్ నెక్ట్స్ మూవీ ఆ హీరోతోనే.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..వివరాల్లోకి వెళితే.. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బన్ని.. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్.. గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో నటిస్తున్నాడు. అతను గంధపు చెక్కలను స్మగ్లింగ్ వెనక పెద్ద రీజనే ఉంటుందట. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఇక ‘పుష్ప’ తర్వాత సుకుమార్.. విజయ్ దేవరకొండతో ఓ ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈ సినిమా విషయమై అఫిషియల్ ప్రకటన కూడా వెలుబడింది. తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్టు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.

    తాజాగా సుకుమార్ అండ్ టీమ్.. ‘పుష్ప’ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడనే  విషయమై క్లారిటీ ఇచ్చారు. పుష్ప తర్వాత సుకుమార్.. తన తర్వాతి సినిమాను రామ్ చరణ్‌తో చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఇక విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా మాత్రం ఆగిపోలేదని చెప్పారు. ఈ సినిమాను రామ్ చరణ్ సినిమా తర్వత పట్టాలెక్కనుంది. ఇక రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

    మరోసారి కలిసి నటించబోతున్న సమంత రామ్ చరణ్ (rangasthalam ram charan samantha)
    రంగస్థలంలో సమంత రామ్ చరణ్ (rangasthalam ram charan samantha)


    ఇపుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా మాత్రం పూర్తి స్టైలిష్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. ఇక రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్‌ తర్వాత శంకర్ సినిమా అనుకున్నాడు. కానీ శంకర్ ముందుగా కమల్ హాసన్‌తో ఇండియన్ 2 పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత రణ్‌వీర్ సింగ్‌తో ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ ఉంది. ఈ రెండు కంప్లీట్ అయ్యేలోపు రామ్ చరణ్, సుకుమార్ సినిమా చేసి ఫ్రీ అవుతాడు. ఆ తర్వాత రామ్ చరణ్, శంకర్ సినిమా పట్టాలెక్కనుంది.

    sukumar and ram charan, sukumar and ram charan web series,ram charan web series,sukumar web series,సుకుమార్, రామ్ చరణ్, వెబ్ సిరీస్
    సుకుమార్ , రామ్ చరణ్ Photo : Twitter


    మరోవైపు సుకుమార్..  విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ కూడా ఫైనలైజ్ అయింది. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కిస్తున్నారు.  ‘ఫైటర్’, ‘పుష్ప’ తర్వాత వీళ్లిద్దరికి ఇది రెండో ప్యాన్ ఇండియా సినిమా అనే చెప్పాలి. మొత్తంగా సుకుమార్ పుష్ప తర్వాత తన తర్వాతి ప్రాజెక్టుల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: