యూత్ ఆడియన్స్ మెచ్చే సినిమాలకు, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఈ మధ్యకాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. ఇదే బాటలో ఇప్పుడు ఓయ్ ఇడియట్ (Oye Idiot) అనే సినిమాతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు మేకర్స్. సహస్ర మూవీస్ (Sahasra Movies), హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్ (Happy Living Entertainment) బ్యానర్స్ పై నిర్మాతలు సత్తిబాబు బాబు మోటూరి & శ్రీనుబాబు పుల్లేటి నిర్మిస్తున్న చిత్రం ఓయ్ ఇడియట్. యశ్వంత్ యజ్జవరుపు (Yashwanth Yajjavarapu), త్రిప్తి శంక్ధర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంతో యువ దర్శకుడు వెంకట్ కడలి (Venkat Kadali) దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు.
దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ పై పూర్తి ఫోకస్ పెట్టింది చిత్ర యూనిట్. తమ సినిమాపై జనం కన్ను పడేలా అప్ డేట్స్ వదులుతూ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. అతి త్వరలో ఈ చిత్రాన్ని ఘనంగా థియేటర్స్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా, తాజాగా చిత్ర యూనిట్‌కి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అభినందనలు లభించాయి. ఓయ్ ఇడియట్ టీమ్‌ని కలిసిన సుకుమార్ టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ అందిస్తూ వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌లో పాజిటివ్ వైబ్రేషన్స్ నింపారు సుకుమార్.
ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. యంగ్ టీమ్ కలసి చేసిన ఓయ్ ఇడియట్ ట్రైలర్ ఫ్రెష్ గా ఉంది. టీనేజ్ లవ్ స్టోరీని స్క్రీన్ మీద అందంగా చూపించారు. ఇండస్ట్రీకి ఇలాంటి కొత్త నటీనటులు టెక్నీషియన్స్ ఎందరో రావాలి. ఓయ్ ఇడియట్ పెద్ద విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Director sukumar, Tollywood, Tollywood actor