అమెజాన్ వైపు అడుగులు వేస్తున్న రామ్ చరణ్ సుకుమార్ కాంబో..

సుకుమార్.. ఆర్యతో దర్శకుడిగా పరిచయమై ఇక అప్పటినుండి వైవిధ్యమైన కథలతో కథనాలతో తెలుగువారి హృదయాలను దోచుకుంటున్న దర్శకుడు.

news18-telugu
Updated: May 2, 2020, 2:16 PM IST
అమెజాన్ వైపు అడుగులు వేస్తున్న రామ్ చరణ్ సుకుమార్ కాంబో..
సుకుమార్ , రామ్ చరణ్ Photo : Twitter
  • Share this:
సుకుమార్.. ఆర్యతో పరిచయమై ఇక అప్పటినుండి వైవిధ్యమైన కథలతో కథనాలతో తెలుగువారి హృదయాలను దోచుకుంటున్న దర్శకుడు. ఆయన సినిమాలు చాలా ప్రత్యేకం. ఓ ఆర్య, జగడం, రంగస్థలం ఇలా ఏ సినిమాకు ఆ సినిమా డిఫరెంట్. ఆయన రీసెంట్ సినిమా రంగస్థలంలో కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతూ.. కులం, దాని ఆధిపత్యం ఎలా ఉంటుందో చర్చిస్తూ.. నిమ్న వర్గాలు తిరగబడితే ఎం జరుగుతుందో ఎంతో కమర్షియల్‌గా చెబుతూ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలాంటీ సామాజిక కోణం ఉన్న సినిమాలు అంత భారీ స్థాయిలో తెరకెక్కించడం తెలుగులో చాలా తక్కువ. ఇలాంటివి మనం ఎక్కువుగా తమిళ్‌లో చూస్తుంటాం. ధనుష్ అసురన్ ఆ కోవలోకే వస్తుంది. రంగస్థలం సినిమా ఆయన సినీ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా మిగిలిపోనుంది. ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్‌తో మరో రఫ్ అండ్ రస్టిక్ ఫీల్ ఉన్న పుష్పను తెరకెక్కిస్తున్నాడు. అది అలా ఉంటే సుకుమార్ డిజిటల్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకోబుతున్నాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకి ఉన్న ఆదరణ అంతకంత పెరుగుతూ పోతుంది. స్టార్ డైరెక్టర్స్ పలు వెబ్ సిరీస్‌లు చేస్తుండగా, అందులో స్టార్ నటీనటులు కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దీ ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. కాజల్, తమన్నా కూడా అటువైపు అడుగులు వేస్తున్నారు.

తాజాగా సుకుమార్.. రామ్ చరణ్ సహాకారంతో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప సినిమా కోసం సుకుమార్ టీం ఎర్రచందనం స్మగ్లింగ్‌ గురించి చాలా పరిశోధన చేసిందట. అయితే రెండున్నర గంటల సినిమాలో ఇవన్నీ చర్చించడం వీలు కాదని భావించిన సుకుమార్.. వెబ్ సిరీస్ అయితే పూర్తిగా వివరించవచ్చని ఆలోచన చేసి ఆ వైపుగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడట. ఈ వెబ్ సిరీస్‌ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది.
First published: May 2, 2020, 2:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading