చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లుగా భారీ మార్పులు చేస్తున్న సుజీత్..

సుజీత్, చిరంజీవి Photo : Twitter

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్యలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే ఆయన మరో సినిమాకు ఓకే చెప్పారు.

  • Share this:
    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్యలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే ఆయన మరో సినిమాకు ఓకే చెప్పారు. ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. మలయాళంలో క్రితం ఏడాది వచ్చిన 'లూసిఫర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. దాంతో ఈ సినిమాను చిరంజీవితో తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌తో భారీ సినిమా 'సాహో' తీసి తన సత్తా చాటుకున్న సుజీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. తెలుగు వర్షన్‌లో ఇక్కడ నెటీవిటికి తగ్గట్లు తగినన్ని మార్పులు చేస్తున్నాడట. అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్ర తెలుగు వెర్షన్ లో చిరు చేస్తుండగా కథలో భారీ మార్పులే జరుగుతున్నాయట. చిరు ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని సుజీత్ తెలుగు వర్షన్ లో కీలక మార్పులు చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా మెగాస్టర్ కెరీర్ లో మరో భారీ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ సినిమా ఆచార్య పూర్తైయాక సెట్స్ పైకి వెళ్లనుంది. కరోనా వల్ల లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా వేసుకున్న ఆచార్య.. సినిమా మొదట దసరాకు అనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే.. దీపావళికి రానుందని తెలుస్తోంది. వీలుంటే క్రిస్మస్ కానుకగా విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.
    Published by:Suresh Rachamalla
    First published: