Home /News /movies /

SUDILGALI SUDHEER PLANNING A MOVIE WITH JABARDASTH ANCHOR RASHMI GAUTAM AK

Sudigali Sudheer: రష్మీతో అలా ప్లాన్ చేస్తున్నా.. ఫ్యాన్స్‌కు సుధీర్ గుడ్ న్యూస్

రష్మీ, సుధీర్ (ఫైల్ ఫోటో)

రష్మీ, సుధీర్ (ఫైల్ ఫోటో)

Sudigali Sudheer Rashmi: సుడిగాలి సుధీర్, రష్మీ కలిసి ఆడియెన్స్‌కు కొత్త రకమైన ఫీల్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సుధీర్ మాటలను బట్టి తెలుస్తోంది.

    సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే స్థాయి కూడా మించిపోయింది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే తమ జోడికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా.. ఇద్దరూ అదే ఫీల్‌ను కొనసాగిస్తున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అన్న విషయం పక్కనపెడితే.. ఈ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారనే విషయం మాత్రం ఇటీవలే బయటకు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సుడిగాలి సుధీర్ బయటపెట్టాడు. రష్మీ తాను కలిసి ఆన్ స్క్రీన్ మీద కలిసి నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నామని సుధీర్ తెలిపాడు. ఇందుకు సంబంధించి తామిద్దరం కథలు వింటున్నామని.. ఇద్దరికి నచ్చిన కథ దొరికిన వెంటనే సినిమా ఉంటుందని సుధీర్ క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని మాత్రం సుధీర్ చెప్పలేదు. కచ్చితంగా లవ్ స్టోరీనే చేయాలనే ఆలోచన తమకు లేదని.. అయితే మంచి కథ మాత్రం ఉండాలని ఆలోచన ఇద్దరికీ ఉందని తెలిపాడు.

    సుధీర్ మాటలకు బట్టి చూస్తే.. ఈ ఏడాది ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా మొదలవుతుందని అర్థమవుతోంది. ఇక జబర్ధస్త్‌ ద్వారా పాపులర్ అయిన సుధీర్.. టాలీవుడ్‌లో సోలో హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఇప్పటివరకు సక్సెస్‌ను మాత్రం చూడలేకపోయాడు. కానీ హీరోగా నిలదొక్కుకోవాలనే తన ప్రయత్నాలను మాత్రం సుధీర్ కొనసాగిస్తున్నాడు.

    ఇక హీరోయిన్‌గా స్థిరపడాలని భావించిన రష్మీది కూడా సేమ్ టు సేమ్ స్టోరీ. హీరోయిన్ కావాలనుకుని జబర్ధస్త్ యాంకర్‌గా పాపులర్ అయిన రష్మీ.. సుధీర్‌తో ఉన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సుధీర్ మాటలను బట్టి తెలుస్తోంది. మొత్తానికి రష్మీతో కలిసి ఆన్ స్క్రీన్ షేర్ చేసుకోవాలని భావిస్తున్న సుధీర్.. త్వరలోనే ఆ ప్రాజెక్టును సెట్స్ మీదకు తీసుకెళతాడేమో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Anchor rashmi gautam, Sudigali sudheer

    తదుపరి వార్తలు