జబర్థస్త్ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది. అందులో సుడిగాలి సుధీర్ ఒకరు. స్మాల్ స్క్రీన్ పై ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో బిగ్ స్క్రీన్ పై తన లక్‌ను పరీక్షించుకున్నాడు. ఇప్పటికే 'సాఫ్ట్వేర్ సుధీర్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత తన ఇద్దరు మిత్రులు శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి 3 మంకీస్ సినిమాలో కూడా నటించాడు.అయితే ఈ రెండు కూడా డిజాస్టర్ అయ్యాయి. తాజాగా మరో సినిమాకు ఈయన కమిట్ అయ్యాడు. రీసెంట్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆ సంగతి పక్కనపెడితే.. తాజాగా సుడిగాలి సుధీర్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఇంపారర్టెంట్ రోల్ చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఐతే.. సుడిగాలి సుధీరర్.. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమాలో చిరంజీవికి అసిస్టెంట్‌గా నటిస్తాడా ? లేకపోతే.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో ఏదైనా ముఖ్యపాత్ర కోసం ఈయన్ని తీసుకున్నారా అనేది మాత్రం తెలియడం లేదు. మొత్తంగా మెగాస్టార్ కూడా తన దర్శకులతో చెప్పి సుడిగాలి సుధీర్‌కు ఏదైనా పాత్ర ఉంటే ఇవ్వమని చెప్పినట్టు సమాచారం. మొత్తంగా సుడిగాలి సుధీర్.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ వస్తే యాక్ట్ చేయాలనే ఆసక్తితో ఉన్నాడు. మరి సుడిగాలి సుధీర్.. చిరంజీవి సినిమాలో ఎలాంటి పాత్ర లభిస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Jabardasth comedy show, Sudigali sudheer, Tollywood