హోమ్ /వార్తలు /సినిమా /

రష్మీ చేసిన పనికి సుడిగాలి సుధీర్ కన్నీళ్లు పెట్టుకొని...భోరు ఏడుస్తూ...

రష్మీ చేసిన పనికి సుడిగాలి సుధీర్ కన్నీళ్లు పెట్టుకొని...భోరు ఏడుస్తూ...

జబర్దస్త్ రష్మి, సుధీర్ (Sudigali Sudheer Rashmi Gautam)

జబర్దస్త్ రష్మి, సుధీర్ (Sudigali Sudheer Rashmi Gautam)

లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే షూటింగులు ఆగిపోయాయి. ఫలితంగా జబర్దస్త్ కొత్త షూటింగులు కూడా నిలిచిపోయాయి. అలాగే ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులకు పని లేకుండా పోయింది. అటు సుడిగాలి సుధీర్ లాంటి స్టార్ ఆర్టిస్టులకు కూడా ప్రస్తుతం పనిలేదు.

ఇంకా చదవండి ...

జబర్దస్త్ లవ్లీ కపుల్ సుడిగాలి సుధీర్, రష్మీ అంటే బుల్లితెర అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఈ కపుల్ గురించి ఏ టాపిక్ అయినా ఎప్పుడూ హాట్ టాపిక్కే...అయితే ఇప్పుడు కరోనా ఈ జంట పాలిట శాపంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే షూటింగులు ఆగిపోయాయి. ఫలితంగా జబర్దస్త్ కొత్త షూటింగులు కూడా నిలిచిపోయాయి. అలాగే ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులకు పని లేకుండా పోయింది. అటు సుడిగాలి సుధీర్ లాంటి స్టార్ ఆర్టిస్టులకు కూడా ప్రస్తుతం పనిలేదు. అయితే లాక్ డౌన్ సమయాన్ని వినియోగించుకునేందుకు రష్మీ తనను తాను బిజీగా ఉంచుకునే పనిలో పడింది. లాక్ డౌన్ కారణంగా మనుషులకే కాదు మూగజీవాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. వీధి కుక్కలకు ఆహారం లేకుండా పోయింది. అసలే కుక్కలు అంటే ప్రాణమిచ్చే రష్మీ వాటి ఆకలి తీర్చేందుకు నడుం కట్టింది. చపాతీలు, అన్నం ప్రత్యేకంగా కుక్కల కోసం అని తయారు చేసి, వీధి కుక్కలు అన్నింటికీ తినేందుకు వడ్డించింది. ఇదే విషయాన్ని రష్మీ ఫోటోలతో సహా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే వీటిని చూసిన సుధీర్, తన స్నేహితురాలు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రష్మీ మనసు చాలా మంచిదని, అంతటి మంచి వ్యక్తి స్నేహం తనకు దొరికిందని సుధీర్ సన్నిహితుల దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

First published:

Tags: Jabardasth, Sudigali sudheer

ఉత్తమ కథలు