సుడిగాలి సుధీర్ షాకింగ్ నిర్ణయం...రష్మీ వద్దని బతిమిలాడినా...వినకుండా...కన్నీళ్లతో..

రష్మి గౌతమ్,, సుడిగాలి సుధీర్ (Rashmi Gautam Sudigali Sudheer)

Sudigali Sudheer-Rashmi: సుధీర్ మాత్రం రష్మీ విషయంలో బాగా హర్ట్ అయ్యాడనే అతడి సన్నిహితులు అంటున్నారు. ఒకవేళ తాను కుటుంబ సభ్యుల బలవంతం మీద పెళ్లి చేసుకున్నా… అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అని బాంబ్ పేల్చినట్లు టాక్ వినిపిస్తోంది.

 • Share this:
  సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ ఈ పేరు వంటే చాలు బుల్లితెర పవర్ స్టార్ అంటూ పొగిడేస్తారు. ఇక సుడిగాలి సుధీర్ అనగానే ముందు గుర్తొచ్చే మరో పేరు రష్మీ. గత ఏడేళ్లుగా వీరిద్దరూ పండిస్తున్న ఆన్ స్క్రీన్ రొమాన్స్, గిల్లికజ్జాలు అంతా ఇంతా కాదు. ఓ ఈవెంట్ వేదికగా వీరిద్దరికీ పెళ్లి చేసి మరీ మల్లెమాల క్రియేషన్స్ హైప్ ను క్యాష్ చేసుకుంది. అటు సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సుడిగాలి సుధీర్, రష్మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని గూగుల్ లో కుప్పలు తెప్పలుగా వార్తలు కనిపిస్తుంటాయి. అంతేకాదు వాళ్లిద్దరూ లవ్ లో ఉన్నారని తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్ ఫాలోయర్లు ప్రతీఒక్కరూ నమ్ముతారు. అయితే తామిద్దరి మధ్య ఉన్నవి కేవలం గాసిప్స్ మాత్రమే అని...నిజం కాదని.. తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అటు సుధీర్ మాత్రమే కాదు రష్మీ కూడా ఎన్నోసార్లు చెప్పింది. అయినప్పటికీ. వీరి అభిమానులు మాత్రం ఏమాత్రం నమ్మడం లేదు.

  అయితే.. తాజాగా సుడిగాలి సుధీర్.. తన పెళ్లి గురించి సన్నిహితుల వద్ద షాకింగ్ కామెంట్స్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. తన కెరీర్ లో ఇప్పుడు హైట్స్ లో ఉన్నాననని అందుకే కొంత కాలం పాటు అసలు పెళ్లి అనే ఊసు ఎత్తడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడట. వీలైనంత కాలం లైఫ్ లో సింగిల్ గానే ఉండాలని అనిపిస్తోందంటూ షాకింగ్ నిర్ణయం తెలియజేశాడట. ఈ వార్త వినగానే సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ గుండెల్లో రాయిపడినంత పని అయ్యింది.

  సుధీర్ మాత్రం ఎవరు ఏమనుకున్న తనకు పట్టదు అన్నట్లు వ్యవహరిస్తున్నాడని, తనకు ఇక పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. లైఫ్ లో సింగిల్ గానే ఉండాలనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. అయితే సుధీర్ ఇంతలా నిర్వేదంగా నిర్ణయం తీసుకోవడం వెనుక రష్మీయే కారణం అంటూ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సుధీర్ ఎంత సిన్సియర్ గా ప్రేమించినా రష్మీ మాత్రం ఏమాత్రం కరుణించడం లేదని, అందుకే సుధీర్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటాడని వాపోతున్నారు.

  అయితే సుధీర్ మాత్రం రష్మీ విషయంలో బాగా హర్ట్ అయ్యాడనే అతడి సన్నిహితులు అంటున్నారు. ఒకవేళ తాను కుటుంబ సభ్యుల బలవంతం మీద పెళ్లి చేసుకున్నా… అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అని బాంబ్ పేల్చినట్లు టాక్ వినిపిస్తోంది. తన జీవితంలోకి వచ్చే అమ్మాయికి తాను మోరల్ సపోర్ట్ ఇస్తానన్నాడు. అలాగే పరిస్థితులను అర్థం చేసుకునే అమ్మాయి అయి ఉండాలంటూ, రష్మీకి పరోక్షంగా చురకుల అంటించాడు. తాను ఎవరి కోసం మారను అని తాను అలాగే ఉండేందుకు ఇష్టపడతాను.. అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు సుధీర్. మరి రష్మీ దీనిపై ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. రష్మీ ఇప్పటికైనా సుధీర్ విషయంలో ఏదో ఒకటి తేల్చకపోతే పరిస్థితి చేయిదాటిపోయే స్థితి వస్తుందని, అప్పుడు సుధీర్ కావాలనుకున్నా దక్కని పరిస్థితి రావచ్చని సుధీర్ ఫ్యాన్స్ రష్మీకి సూచిస్తున్నారు.
  Published by:Krishna Adithya
  First published: