Home /News /movies /

SUDIGALI SUDHEER TO HYPER AADI THESE JABARDASTH COMEDIANS REMUNARATIONS IS VERY HIGH HERE ARE THE DETAILS TA

Sudigali Sudheer - Hyper Aadi : సుడిగాలి సుధీర్, హైపర్ ఆది సహా జబర్ధస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

హైపర్ ఆది సుడిగాలి సుధీర్ (Hyper Aadi Sudheer/YouTube Mallemala Productions)

హైపర్ ఆది సుడిగాలి సుధీర్ (Hyper Aadi Sudheer/YouTube Mallemala Productions)

Sudigali Sudheer - Hyper Aadi : ప్రస్తుతం తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ మంది ఆడియన్స్ చూసే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్థస్త్ ప్రోగ్రామ్ అని చెప్పక తప్పుదు. ఈ ప్రోగ్రామ్‌లో సుడిగాలి సుధీర్ నుంచి హైపర్ ఆది వరకు జబర్ధస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్ విషయానికొస్తే..

ఇంకా చదవండి ...
    Sudigali Sudheer - Hyper Aadi : ప్రస్తుతం తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ మంది ఆడియన్స్ చూసే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్థస్త్ ప్రోగ్రామ్ అని చెప్పక తప్పుదు. వారంలో ప్రతి గురువారం, శుక్రవారం జబర్థస్త్, ఎక్స్‌ట్రా జబర్థస్త్ ప్రోగ్రాం గురించి ఎదురు చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ షోలను టీవీలో కంటే యూట్యూబ్‌లోనే లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. అప్పట్లో కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్‌కు మధ్యలో తాత్కాలిక బ్రేక్  వచ్చింది.  లాక్‌డౌన్ సడలింపులు తర్వాత జబర్దస్త్ మరోసారి టీవీల్లో సత్తా చూపెడుతూనే ఉంది. లాక్‌డౌన్ తర్వాత టీఆర్పీల విషయంలో కాస్త వెనకబడ్డ.. మళ్లీ స్మాల్ స్క్రీన్ పై తన దూకుడు చూపెడుతూనే ఉంది.

    జబర్థస్త్ షో విషయానికొస్తే..  ఈ షోలో ఎక్కువగా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రోగ్రాంను ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండటం లేదని కామన్  ఆడియన్స్‌తో పాటు సినీ ప్రముఖులు కూడా జబర్థస్త్ ప్రోగ్రాంపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సందర్భాలున్నాయి. అయినా జబర్ధస్త్ షోకు దూసుకుపోతూనే ఉంది. ఈ ప్రోగ్రామ్‌కు పోటీగా పలు ఛానెల్స్‌లో కామెడీ ప్రోగ్రామ్‌లు వచ్చానా.. అంతగా సక్సెస్ సాధించలేకపోయాయి.  వివాదాల సంగతి పక్కనపెడితే.. ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది.

    Pawan Kalyan : ‘అత్తారింటికి దారేది’ కి 8 యేళ్లు పూర్తి.. పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ మ్యాజిక్..


    ఈ షోలో  పార్టిసిపేట్ చేసేవారు ఎవరెవరు ఎంతెంత పారితోషకం తీసుకుంటారనే విషయం ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక జబర్ధస్త్ జడ్జ్‌గా రోజాకు నెలకు రూ. 20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పారితోషం తీసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు జబర్థస్త్ జడ్జ్ నాగబాబు ప్లేస్‌లో వచ్చిన మనోకు ఇపుడు రూ. 10 లక్షల వరకు పారితోషకం ఇస్తున్నారట. బబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ యాంకర్స్ అనసూయ రష్మిలకు నెలకు రూ. 4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకుంటున్నారని సమాచారం.

    సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)
    సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)


    ఇక టీమ్ లీడర్స్ విషయంలో చమ్మక చంద్ర హైపర్ ఆది కంటే ఎక్కవగా నెలకు రూ. 4.లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నాడని చెబుతున్నారు. సుడిగాలి సుధీర్ 3.5 లక్షలు, హైపర్ ఆదికి రూ.3 లక్షలు అందుకుంటున్నాడు. మరోవైపు గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, కిరాక్ ఆర్పీలు రూ.2.5 లక్షలు అందుకున్నట్టు సమాచారం. బుల్లెట్ భాస్కర్ కు రూ.2లక్షలు, ఇతర కమెడియన్లకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఇంటర్నల్ టాక్.

    Rajamouli@20 Years: దర్శకుడిగా 20 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న రాజమౌళి.. ఆకాశమే హద్దుగా జక్కన్న సినీ ప్రయాణం..

    అయితే.. జబర్ధస్త్ కమెడియన్స్‌కు మల్లెమాల టీమ్ వాళ్లు సినిమాల్లో వేషాలు వేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడంతో వీళ్లు రెండు చేతులా సంపాదిస్తున్నారు.  మధ్యలో కరోనా కారణంగా రెమ్యునరేషన్‌లో కోతలు విధించినా.. ఫైనల్‌గా అందరికీ ఎప్పటిలాగా ఎవరి పారితోషకాలు వారికి ఇస్తున్నారట. దాదాపు ఇపుడు వీళ్ల పారితోషకాలను దాదాపు 10 నుంచి 20 శాతం వరకు పెంచనున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Hyper Aadi, Jabardasth comedy show, Sudigali sudheer, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు