Home /News /movies /

SUDIGALI SUDHEER SPECIAL SKIT WITH ANCHOR RASHMI GAUTAM IN EXTRA JABARDASTH AND PROMO GOING VIRAL PK

Sudigali Sudheer - Rashmi Gautam: రష్మి గౌతమ్‌తో ఆ రాత్రి గురించి కబుర్లు చెప్పిన సుడిగాలి సుధీర్..

సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ స్పెషల్ స్కిట్ (rashmi gautam sudigali sudheer)

సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ స్పెషల్ స్కిట్ (rashmi gautam sudigali sudheer)

Sudigali Sudheer - Rashmi Gautam: బుల్లితెరపై సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer - Rashmi Gautam) అంటే వెంటనే గుర్తుకొచ్చే మరో పేరు రష్మి గౌతమ్. ఎందుకంటే ఇద్దరూ ఇద్దరే.. ఈ ఇద్దరూ అలా కనిపిస్తుంటే చూసే వాళ్లకు కన్నుల పండగే. అంత బాగా సెట్ అయిపోయారు ఈ జోడీ. అందుకే నిర్వాహకులు కూడా వాళ్లతోనే ఎక్కువగా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటారు.

ఇంకా చదవండి ...
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ అంటే వెంటనే గుర్తుకొచ్చే మరో పేరు రష్మి గౌతమ్. ఎందుకంటే ఇద్దరూ ఇద్దరే.. ఈ ఇద్దరూ అలా కనిపిస్తుంటే చూసే వాళ్లకు కన్నుల పండగే. అంత బాగా సెట్ అయిపోయారు ఈ జోడీ. అందుకే నిర్వాహకులు కూడా వాళ్లతోనే ఎక్కువగా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటారు. చేసిన ప్రోగ్రామ్స్‌కు ప్రోమోలను సైతం రష్మి, సుధీర్‌పై కట్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ వచ్చే వారం ప్రోమో విడుదలైంది. అందులో మరోసారి సుధీర్, రష్మిని హైలైట్ చేసారు. మరీ ముఖ్యంగా ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని సరిగ్గా వాడుకుంటూ ప్రోమోను కట్ చేసారు. 4 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమో బాగానే నవ్విస్తుంది. అందులో రష్మి, సుధీర్ స్పెషల్ స్కిట్ చేసారు. అది కూడా అదిరిపోయింది. ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే ఉంది ఈ ప్రోమో. సుధీర్, రష్మి స్కిట్‌లో బుల్లెట్ భాస్కర్, పొట్టి నరేష్ కూడా ఉన్నారు.

అందులో సుధీర్, బుల్లెట్ భాస్కర్‌లను ఇంటరాగేషన్ చేస్తారు నలుగురు పోలీసులు, రష్మి గౌతమ్. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సుడిగాలి సుధీర్ దిమ్మతిరిగే పోయే సమాధానాలు ఇస్తుంటాడు. మొబైల్ పాస్ వర్డ్ ఏంటనీ రష్మీ గౌతమ్ అడగగా ‘ఉమ్మా’ అని చెప్తాడు సుధీర్. అలాగే జీ మెయిల్ పాస్ వర్డ్ ను అడగగా ‘తొందరగా వచ్చేయ్’ అంటాడు. నువ్వు గోడలు ఎందుకు దూసుకుతున్నావు అని రష్మి అడగ్గానే.. మరింత కామెడీగా సమాధానం చెప్పాడు సుధీర్. ‘ఇచ్చట మూత్రం పోయరాదు.. అని రాసి ఉండటంతో.. అటు వైపు మూత్రం పోసేందుకు గోడ దూకుతున్నాను’ అంటూ చిలిపి ఆన్సర్స్ చెప్పాడు.

పొద్దున్నే ఏం చేస్తావురా నువ్వు అంటే.. మా ఇంటికి వెళ్లిపోతాను అంటూ చెప్పాడు సుధీర్. రాత్రి ఎక్కడికి వెళ్తావ్ అంటే దానికి మరో పంచ్ వేసాడు. ఈ ప్రశ్న రష్మి గౌతమ్ అడగడంతో మరింత వైరల్ అవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇద్దరికి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. సుధీర్, రష్మి ఫుల్ స్కిట్ చేస్తే బాగుంటుందని చాలా రోజుల నుంచి అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు అది జరిగింది. తాజాగా ఈ ఇద్దరూ ఒకే స్కిట్‌లో కనిపించారు.. తమ అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను బాగానే నవ్వించారు. ఈ స్కిట్ కోసం ఫ్యాన్స్ బాగానే వేచి చూస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anchor rashmi gautam, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు