బుల్లితెరపై మ్యాజిక్ చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. స్మాల్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన సుధీర్.. ఇప్పుడు వెండితెరపై కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూసాడు. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ సుధీర్ అంటూ వచ్చాడు కూడా. అయితే ఈ చిత్రం సుధీర్ అభిమానులను కూడా నిరాశ పరిచింది. కానీ నిర్మాత మాత్రం మరోలా చెబుతున్నాడు. తనకు ఈ చిత్రంతో ఫుల్లుగా లాభాలు వచ్చాయంటున్నాడు. స్వతహాగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి అయిన శేఖర్ రాజు.. ఈ చిత్రాన్ని దాదాపు 3 కోట్లతో నిర్మించాడు. అయితే బయ్యర్లు కూడా లేకపోవడంతో సీడెడ్, నైజాంలో ఓన్ రిలీజ్ చేసుకున్నాడు శేఖర్ రాజు.
సాఫ్ట్‌వేర్ సుధీర్ కేవలం సుధీర్ ఇమేజ్‌తోనే విడుదలైంది. అయితే ఆయన ఆశలకు ఈ సినిమా గండి కొట్టింది. రాజశేఖర్ పులిచర్ల తెరకెక్కించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. ఒక్క సుధీర్ తప్ప సినిమాలో చూడ్డానికి ఏం లేదంటూ తేల్చేసారు ప్రేక్షకులు. పైగా పాత కథ.. బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే అన్నీ సుధీర్ సినిమాకు మైనస్ అయ్యాయి. తొలివారంలో ఈ చిత్రం కోటి రూపాయల షేర్ కూడా తీసుకురాలేదని విశ్లేషకులు చెబుతున్న మాట. బుల్లితెరపై సుధీర్‌కు ఉన్న ఫాలోయింగ్ ఈ చిత్రానికి మొదట్లో ఓపెనింగ్స్ తీసుకొచ్చేలా చేసింది. థియేటర్ వరకు ప్రేక్షకులు రావడానికి సుధీర్ డాన్సులు కాస్త పని చేసాయి.
సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాకు తొలిరోజు 30 లక్షల వరకు షేర్ వచ్చిందని తెలుస్తుంది. అయితే రెండోరోజు నుంచి మాత్రం కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కలెక్షన్స్ పరంగా సుధీర్ తొలిరోజు ఓకే అనిపించాడు కానీ తర్వాత మాత్రం పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు. కోటిన్నర వరకు బిజినెస్ చేసిన ఈ చిత్రానికి బయ్యర్లు నష్టపోవడం తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. కానీ నిర్మాత శేఖర్ రాజు మాత్రం తనకు ఈ చిత్రంతో దాదాపు 5 కోట్ల వరకు లాభాలు వచ్చాయని.. కచ్చితంగా సుధీర్, రష్మితో సినిమా చేస్తానంటున్నాడు. మొత్తానికి ఈ గ్యాంబ్లింగ్ ఏంటో మరి వాళ్లకే తెలియాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sudigali sudheer, Telugu Cinema, Tollywood